Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదేంటి 'ఆచార్య' : అపుడు అలా.. ఇపుడు ఇలా లీక్ చేస్తే ఎలా?

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (13:04 IST)
మెగాస్టార్ చిరంజీవి నోటి నుంచి మరోమారు నిజం వెలువడింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం కథ ఏ కోణంలో సాగుతుందో బహిరంగంగా చెప్పేశారు. దీంతో చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయింది. నిజానికి ఈ చిత్రను దర్శకుడు కొరటాల శివగానీ, ఇతర యూనిట్ సభ్యులుగానీ ఎక్కడా లీక్ చేయలేదు. చివరకు హీరో చిరంజీవి నోటి వెంట నుంచి బయటకు రావడం గమనార్హం. గతంలో కూడా చిత్ర టైటిల్‌ను కూడా చిరంజీవే తొందరపడి వెల్లడించారు. ఓ చిత్ర ఆడియో ఫంక్షన్‌లో పాల్గొన్న చిరంజీవి.. తాను నటిస్తున్న తాజా చిత్రం ఆచార్యలో అంటూ చెప్పారు. దీంతో కొరటాల శివ - చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రం పేరు టైటిల్ అని మీడియా ఖరారు చేసింది. చివరకు ఆ టైటిలే చిత్ర టైటిల్‌గా మారింది. ఇపుడు చిత్ర కథను కూడా చిరంజీవి లీక్ చేయడం గమనార్హం. 
 
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 152వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 80 శాతం పూర్తయిందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ - మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమాలో చిరంజీవికి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రాం చరణ్ కీలక పాత్రలో కనిపించబోతుండగా ఆయనకి జంటగా పూజా హెగ్డే నటిస్తోందట. ఇక ఈ సినిమా మే 13న దేశ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌ని ఫ్లోలో మెగాస్టార్ రివీల్ చేశారు. 
 
ఆ తర్వాత ఆచార్య సినిమాలో ఒక ముఖ్య పాత్ర సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ చరణ్ ఆ పాత్రని చేయబోతున్నట్టు మెగాస్టార్ పొరపాటున చెప్పేశాడు. తాజాగా ఆచార్య సినిమాకి సంబంధించిన మరొక కీలకమైన విషయాన్ని బయట పెట్టేశాడు. 
 
ఆచార్య సినిమా దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథలో నక్సల్స్ నేపథ్యం కూడా ఉంటుందని ప్రచారం జరుగుతూ పలు రకాల రూమర్స్ వస్తున్నాయి. 
 
కానీ దర్శకుడు.. మిగతా యూనిట్ సభ్యులుగానీ ఈ విషయాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. అయితే తాజాగా రానా దగ్గుబాటి నటించిన "విరాట పర్వం" సినిమా టీజర్‌ను మెగాస్టార్ రిలీజ్ చేశారు.  
 
ఆ సమయంలోనే 'విరాట పర్వం' టీజర్ చూస్తుంటే నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కిందనిపిస్తోంది. మా 'ఆచార్య' సినిమా కూడా నక్సల్స్ బ్యాక్‌డ్రాప్ అనేశాడు. దీంతో ఇన్నాళ్ళు రూమర్స్ అనుకున్న విషయాన్ని మెగాస్టార్ రివీల్ చేసి నిజం చేశాడని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments