Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ఔదార్యం : అనారోగ్య వీరాభిమాని ప్రాణానికి భరోసా

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (17:29 IST)
మెగాస్టార్ చిరంజీవి మరోమారు తనలోని పెద్ద మనసును చాటుకున్నారు. విశాఖకు చెందిన ఓ వీరాభిమాని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి చలించిపోయారు. తాను ఎంతగానో ఆరాధించే మెగాస్టార్ చిరంజీవిని కలవాలని, మాట్లాడాలని ఆ వీరాభిమాని భావించాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో వెలిబుచ్చాడు. 
 
ఈ విషయం ఇతర మెగా అభిమానులు చిరంజీవి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంకట్ తనను కలవొచ్చని తెలిపారు. కానీ వెంకట్ అనారోగ్యం కారణంగా బస్సు, రైలు ప్రయాణాలు చేసే పరిస్థితిలో లేకపోవడంతో, ఈ విషయం గుర్తించిన చిరంజీవి పెద్దమనసుతో వ్యవహరించారు. వెంకట్‌‍కు, ఆయన భార్య సుజాతకు విశాఖ నుంచి హైదరాబాదుకు విమాన ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు.
 
దీంతో శనివారం తన భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చిన వెంకట్ తన ఆరాధ్య హీరో చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి మురిసిపోయారు. తన ఇంటికి వచ్చిన వెంకట్ దంపతులతో చిరంజీవి ఆప్యాయంగా ముచ్చటించారు. వెంకట్ అనారోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 
 
వైద్య పరీక్షల కోసం హైదరాబాదులోని ఒమేగా ఆసుపత్రికి పంపించారు. మెడికల్ రిపోర్ట్స్‌పై ఒమేగా డాక్టర్లతో మాట్లాడారు. వెంకట్ విశాఖలో చికిత్స పొందవచ్చని, ఆసుపత్రి ఖర్చులను తానే భరిస్తానని ఈ సందర్భంగా చిరంజీవి భరోసా ఇచ్చారు.
 
మరింత మెరుగైన చికిత్స అవసరమైతే చెన్నై తరలించేందుకు అయినా తాను సిద్ధంగా ఉన్నానని, వెంకట్ వంటి అభిమానిని కాపాడుకోవడంలో రాజీపడబోనని చిరంజీవి స్పష్టం చేశారు.
 
 ఈ సందర్భంగా వెంకట్ ఆనందం అంతాఇంతా కాదు. చిరంజీవిని కలవాలన్న కల నెరవేరడం సంతోషదాయకం అనుకుంటే, తన అనారోగ్యానికి ఆయనే చికిత్స చేయిస్తానని ముందుకు రావడం అతడిని మరింత ఆనందానికి గురిచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments