Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో విషాదం: పునాదిరాళ్లు దర్శకుడు.. ఉదయ్ కిరణ్‌ల మృతి

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (13:14 IST)
chiru First Director
పరారే పరారే.. ఫ్రెండ్స్ బుక్ సహా పలు తమిళ సినిమాల్లో ఉదయ్ కిరణ్ నటించాడు. అయితే ఉదయ్ కిరణ్ శుక్రవారం రాత్రి కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని రామారావుపేటలోని నివాసం ఉంచారు. ఉదయ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
 
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం 'పునాదిరాళ్లు'. ఈ సినిమా దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ శనివారం ఉదయం మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో కారణంగా బాధపడుతోన్న ఆయన శనివారం తనువు చాలించారు. రాజ్‌కుమార్‌ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మెగాస్టార్ అపోలో ఆసుపత్రిలో వైద్యం చేయించారు. రాజ్‌కుమార్‌ స్వస్థలం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు.
 
కాగా.. భౌతికకాయాన్ని ఉయ్యూరు తరలించేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రాజ్‌కుమార్‌ పెద్ద కుమారుడు మరణించారు. ఆ తర్వాత భార్య కూడా మృతి చెందడంతో ఒంటరివాడు అయ్యాడు. అద్దె ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. రాజ్‌కుమార్‌ తన మొదటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాకుండా ఆ చిత్రానికి ఐదు నంది అవార్డులు దక్కించుకొని గుర్తింపు పొందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments