Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైతూకు ముద్దు పెట్టిన సాయిపల్లవి.. సమంత రియాక్షన్ చూస్తే... (వీడియో)

Advertiesment
చైతూకు ముద్దు పెట్టిన సాయిపల్లవి.. సమంత రియాక్షన్ చూస్తే... (వీడియో)
, శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (13:55 IST)
అక్కినేని నాగ చైతన్య - సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కుమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను ఏయ్ పిల్లా మ్యూజికల్ రివ్యూ పేరుతో రిలీజ్ చేశారు. 
 
ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ వీడియోలోని చివ‌రి సీన్‌లో చైతూ బుగ్గ‌పై సాయిప‌ల్లవి గ‌ట్టిగా ముద్దాడుతుంది. ఆ సీన్‌ని చూసి ప్రేక్ష‌కులే నోరెళ్ళ‌పెట్టారు.
 
దీనిపై నాగ చైతన్య భార్య, హీరోయిన్ అయిన సమంత కూడా స్పందించి నోరెళ్లబెట్టింది. త‌న ట్విట్ట‌ర్‌లో వీడియో బాగుంద‌ని చెబుతూ.. చివ‌రిలోని 'సీన్ న‌న్ను షాక్‌కి గురి చేసింది. ఆ సీన్ చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింద‌ని' స‌మంత త‌న కామెంట్ రూపంలో తెలిపింది. ఈ వీడియోను నాలుగున్నర లక్షల మంది వీక్షించారు.

 
 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడిని గుడ్డిగా నమ్మి సర్వస్వం సమర్పించి మోసపోయా... బాలీవుడ్ నటి