Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా స‌క్స‌ెస్ సంతోషంలో చిరు, చ‌ర‌ణ్.

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (17:57 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ తొలిసారి ఒక స్వతంత్ర సమరయోధుడు పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆయన సరసన నయనతార హీరోయిన్‌గా నటించారు. ఇక విపరీతమైన అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి సర్వత్రా ప్రశంశలు కురుస్తున్నాయి. 
 
మెగాస్టార్ తన స్పెల్ బౌండింగ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారని, అలానే నిర్మాత రామ్ చరణ్ పెట్టిన ఖర్చు తాలూకు ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనపడిందని అంటున్నారు.
 
 దర్శకుడిగా సురేందర్ రెడ్డి సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, అలానే అమితాబ్ సహా ఇతర పాత్రధారులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించినట్లు చెప్తున్నారు. 
 
ఇకపోతే సినిమాకు అద్భుతంగా టాక్ రావడంతో, తన కుమారుడు మరియు సైరా నిర్మాతైన రామ్ చరణ్‌తో మెగాస్టార్ చిరంజీవి తమ సినిమా విజయానందాన్ని పంచుకున్నారు. కాగా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Thota Trimurthulu: పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలి.. తోట త్రిమూర్తులు

ఉత్తర భారతదేశాన్ని కప్పేస్తున్న పొగమంచు, కుక్కపిల్లలకు చలిమంట వేస్తున్న యువకుడు (video)

జేసీ ప్రభాకర్ రెడ్డి: తన బస్సులు కాలిన ఘటన తర్వాత జగన్ రెడ్డి మంచోడు అని ఎందుకు అంటున్నారు?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏడు విమానాశ్రయాలు.. భూసేకరణ జరుగుతోంది-బాబు

Nara Lokesh : చదువు రాజకీయాలకు దూరంగా వుండాలి.. జీవితాన్ని పరీక్షగా తీసుకోండి: నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments