Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రోజు అలా జరిగివుంటే ఈ చిరంజీవి మీ ముందువుండేవారు కాదు: మెగాస్టార్

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (12:08 IST)
మెగాస్టార్ చిరంజీవి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. పైగా, ఈ విషయం ఇప్పటివరకు చిరంజీవి కుటుంబ సభ్యులకు మినహా ఇతరులకు తెలియదు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని నాగేశ్వర రావు జాతీయ పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన ఇప్పటివరకు బయటి వ్యక్తులకు తెలియని ఓ విషయాన్ని సభాముఖంగా వెల్లడించారు. ఆయన చెప్పిన విధానం ఏ దర్శకుడికి తీసిపోని విధంగా ఉండడంతో సభికులు కూడా ఎంతో ఆసక్తిగా విని చివర్లో అత్యంత విస్మయానికి లోనయ్యారు. ఇంతకీ ఆయనేం చెప్పారంటే... ఓ కొత్త జంట పల్లెటూరు నుంచి పక్కనే ఉన్న పట్టణానికి సినిమా చూసేందుకు బయల్దేరారంటూ మొదలుపెట్టారు.
 
'ఆ సమయంలో భార్య గర్భవతిదాల్చివుంది. కాన్పుకు సమయం కూడా సమీపించింది. కానీ తన అభిమాన హీరో సినిమా విడుదలైంది. దాంతో ఆ సినిమా చూడాలన్న కోరికను తన భర్తతో చెప్పింది. పక్కనే ఉన్న పట్టణానికి వెళ్లాలంటే ఆరు కిలోమీటర్లు ప్రయాణించాలి. ఓ నిండు గర్భవతికి అది చాలా ప్రమాదంతో కూడిన ప్రయాణం. అయినా భార్య కోరిక కాదనలేక ఆ భర్త ఓ జట్కా బండి ఏర్పాటు చేశాడు. అయితే మార్గమధ్యంలో వారు ఎక్కిన గుర్రపుబండి ప్రమాదానికి గురై పక్కకి పడిపోయింది. భార్య కూడా కిందపడిపోవడంతో భర్త తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
 
వెనక్కివెళ్లిపోదామని ఆ భర్త చెప్పినా భార్య వినిపించుకోకుండా సినిమాకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టింది. దాంతో అలాగే ముందుకెళ్లి సినిమా చూసి వచ్చారు. ఆనాడు గర్భంతో ఉన్న ఆవిడ ఎవరో కాదు మా అమ్మ అంజనాదేవి. భార్య కోరిక తీర్చిన ఆ వ్యక్తి మా నాన్న వెంకట్రావు. మా అమ్మ చూడాలనుకున్న సినిమా 'రోజులు మారాయి'. కథానాయకుడు ఎవరో కాదు ఈ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారే. ఇంతకీ ఆమె కడుపులో ఉన్నది ఎవరో కాదు నేనే" అంటూ సభికులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరైనవారంతా కళతాళ ధ్వనులతో అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments