Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అజ్ఞాతవాసి'పై చిరంజీవి ఏమన్నారో తెలుసా?

అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌‌ల మధ్య గతంలో దూరం ఉన్నా ఇప్పుడు మాత్రం ఆ దూరం దగ్గరైంది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్‌‌కు ఇప్పుడు ఎలాంటి మనస్పర్థలు లేవు. అందుకే చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ ఎప్పుడు ఏం చేస్తున్నాడో ఒక కంట

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (14:07 IST)
అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌‌ల మధ్య  గతంలో దూరం ఉన్నా ఇప్పుడు మాత్రం ఆ దూరం దగ్గరైంది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్‌‌కు ఇప్పుడు ఎలాంటి మనస్పర్థలు లేవు. అందుకే చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ ఎప్పుడు ఏం చేస్తున్నాడో ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. అది రాజకీయం అయినా, సినిమా రంగం అయినా పవన్ కళ్యాణ్‌ ఎలాంటి అడుగులు వేస్తున్నారో గమనిస్తూనే ఉన్నారు. 
 
తాజాగా పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ వారణాసిలో రిలీజ్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. మొదటిసారి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో ఆ పిక్చర్ ఫస్ట్ లుక్ వైరల్‌గా మారింది. 
 
కోట్లాదిమంది పవన్ అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పైన చిరంజీవి తనదైన శైలిలో స్పందించారు. ఈ లుక్ నా తమ్ముడికి చాలా బాగుంది. ఫస్ట్ లుక్‌కే ఇంత బాగుందంటే.. ఇక సినిమా ఏవిధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. పవన్ 25వ సినిమా సినిమా భారీ హిట్ సాధిస్తుందన్న నమ్మకం నాకుంది అంటూ చిరు తన కుటుంబ సభ్యులతో చెప్పారట. తమ్ముడిపై తనకున్న ప్రేమను మరోసారి చిరంజీవి ఈవిధంగా చాటుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

నాలా వద్ద మహిళ మృతదేహం.. వరదల్లో కొట్టుకుపోయిందా?

ఢిల్లీ సీఎంపై దాడి ఘటనపై కేంద్రం సీరియస్ : జడ్ కేటగిరీ భద్రత

మద్యం కేసులో ఏపీ సర్కారు కీలక నిర్ణయం : రాజ్‌ కసిరెడ్డి ఆస్తుల జప్తు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments