Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆచార్య" నుంచి మరో లీక్... ఏంటది?

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (20:35 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. 
 
అయితే, ఈ చిత్రం షూటింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు సింగరేణి బొగ్గు గనుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా 'ఆచార్య' సెట్స్ నుంచి ఓ ఆసక్తికరమైన ఫొటో బయటికి వచ్చింది. చిరంజీవి, రామ్ చరణ్ సైనిక దుస్తుల్లో ఉండగా, వారికి దర్శకుడు కొరటాల శివ సీన్ వివరిస్తుండటం ఆ ఫొటోలో చూడొచ్చు. 
 
ఇటీవలే మారేడుమిల్లి అడవుల్లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఆచార్య', కొత్త షెడ్యూల్ ఇల్లెందులో షురూ అయింది. ఇక్కడి బొగ్గు గనుల్లో ఫైటింగ్ సీక్వెన్స్‌‌‍లను చిత్రీకరించనున్నారు. దర్శకుడు కొరటాల ఫైట్ మాస్టర్లు రామ్ - లక్ష్మణ్‌లతో కలిసి ఆదివారం ఉదయమే లొకేషన్‌ను పరిశీలించారు.
 
కాగా, ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ హౌస్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ 'ఆచార్య' చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన కాసేపు తళుక్కుమనే పాత్రలో పూజా హెగ్డే కనిపించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

హైదరాబాదులో మైనర్ సవతి కూతురిపై వేధింపులు.. ప్రేమ పేరుతో మరో యువతిపై?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments