Webdunia - Bharat's app for daily news and videos

Install App

''చినబాబు'' రైతుబిడ్డగా వచ్చేస్తున్నాడు..

ఊపిరి ఫేమ్ కార్తీ హీరోగా చినబాబు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంజి. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న కార్తీ.. చినబాబులో రైతుబిడ్డగా నటించాడు. తమిళంలో ఈ చిత్రం 'కడకుట్టి సింగం'గా రూపొందింది. సూర్య సొ

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (14:19 IST)
ఊపిరి ఫేమ్ కార్తీ హీరోగా చినబాబు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంజి. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న కార్తీ.. చినబాబులో రైతుబిడ్డగా నటించాడు. తమిళంలో ఈ చిత్రం 'కడకుట్టి సింగం'గా రూపొందింది. సూర్య సొంత బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. పల్లెటూరి నేపథ్యంలో వ్యవసాయంపై ఆధారపడిన రైతుల జీవితాల నేపథ్యంలో ఈ కథ కొనసాగుతోంది. 
 
ఈ చిత్రంలో కార్తీ రైతుల కోసం పోరాడుతున్నాడు. సాయేషా సైగల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. సత్యరాజ్ ముఖ్యపాత్రలో నటించారు. రైతుల సమస్యలను చర్చిస్తూనే.. కామెడీ, యాక్షన్‌తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.
 
ఇక.. రంగస్థలం సినిమాలో కాశీ పాత్రలో నటించిన తెలుగు నటుడు శత్రు ''చినబాబు''లో ప్రధాన విలన్‌గా కనిపించనున్నాడు. ప్రియా భవాని శంకర్, సత్య రాజ్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను తదితరులు నటించారు. సంగీతం- డి.ఇమాన్. ఈ సందర్భంగా తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments