Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చి.ల.సౌ' దర్శకుడికి జాక్‌పాట్... రూ.25 లక్షల చెక్ ఇచ్చిన హీరో

నేటికాలంలో ఊబకాయం సమస్య ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తోంది. ఈ అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ నానా తంటాలు పడుతుంటారు. అయితే, అధిక బరువును సునాయాసంగా తగ్గించవచ్చు.నటుడు అయిన రాహుల్ రవీంద

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (17:13 IST)
నటుడు అయిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా ఓ మంచి హిట్ అందుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం "చి.ల.సౌ." మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, ఈ చిత్రంలో నటించిన అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్‌కి కూడా మంచి బ్రేక్ వచ్చినట్టయింది. ఈ చిత్రం అన్ని విభాగాల్లో మంచి టాక్ వచ్చింది. ఫలితంగా కాసుల వర్షం కురిపిస్తున్నాడు.
 
అయితే, ఈ చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కు మంచి బంపర్ ఆవర్ వరించింది. అదేనండీ… అన్నపూర్ణ స్టూడియోస్‌లో దర్శకుడిగా తన రెండో సినిమా చేయడానికి అడ్వాన్స్‌ పుచ్చుకున్నాడు. ఈ అడ్వాన్స్ ఇచ్చింది కూడా యువ సామ్రాట్ నాగార్జున కావడం గమనార్హం. ఇంతకీ అతను అందుకున్న మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.25 లక్షలు. 
 
'చి.ల.సౌ' విడుదలకు ముందే చూసిన నాగార్జున, నాగచైతన్య తమ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ ద్వారా సినిమాను విడుదల చేయడానికి అగ్రిమెంట్‌ చేసుకున్నారు. 'చి.ల.సౌ' చూసిన వెంటనే తదుపరి మూవీ తమకే చేయాలని రాహుల్‌ రవీంద్రన్‌‌తో ఒట్టు వేయించుకుని ఆయన చేతిలో నాగార్జున రూ.పాతిక లక్షల చెక్‌ అడ్వాన్స్‌గా పెట్టారట! దర్శకుడిగా మొదటి సినిమాకి రాహుల్‌ అందుకున్న రెమ్యునరేషన్‌ కంటే ఈ అడ్వాన్స్‌ ఎక్కువట! 
 
డబ్బుకి డబ్బు… డబ్బుకి తోడు పేరున్న సంస్థలో సినిమా చేసే అవకాశం రావడంతో సరేనన్నాడు. ప్రస్తుతం అతని దగ్గరున్న రెండు మూడు లైన్లను డెవలప్‌ చేసి నాగార్జునకు వినిపిస్తే… తమ ఫ్యామిలీ హీరోల్లో ఎవరికి సూటవుతుందని అనుకుంటే వారితో సినిమా చేస్తారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments