వైష్ణ‌వ్ తేజ్ పంజా హీరోగా ఛ‌త్ర‌ప‌తి ప్ర‌సాద్ నిర్మాత‌గా షూటింగ్ ప్రారంభం

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (17:22 IST)
Vaishnav Tej, BVSN Prasad, Girishaya
‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా మ‌రో కొత్త సినిమా ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో అర్జున్ రెడ్డి త‌మిళ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్‌ గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్.ప్ర‌సాద్ నిర్మాత‌గా రూపొందుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభ‌మైంది. 
 
చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బ్యానర్‌లో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసి సక్సెస్ సాధించిన సందీప్ రెడ్డి వంగాగారి శిష్యుడు గిరీశాయ ఈ చిత్రంతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఉప్పెన‌తో యూత్‌కు ద‌గ్గ‌రైన వైష్ణ‌వ్ తేజ్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ద‌గ్గ‌ర చేసేంత మంచి క‌థ‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను రూపొందించ‌బోతున్నాం. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా నటిస్తుంది.శ్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments