Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను పెళ్లి చేసుకుంటే వారికొచ్చిన నష్టమేంటో? : ఖాకీలను ఆశ్రయించిన నటి

Webdunia
బుధవారం, 15 జులై 2020 (14:44 IST)
తమిళ నటుడు విజయకుమార్ కుమార్తెల్లో ఒకరు వనిత విజయ్ కుమార్ ఒకరు. ఈమె ఇటీవల ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. వయసుకు వచ్చిన ఇద్దరు ఆడపిల్లలతో పాటు.. మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, వనిత మూడో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆమెపై అనేక విమర్శలు వస్తున్నాయి. 
 
తాజాగా వారిపై విమర్శలు గుప్పిస్తోన్న వారి జాబితాలో సినీ నిర్మాత రవీంద్రన్‌ కూడా చేరారు. దీంతో ఆయనపై వనిత‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనతో పాటు తనపై విమర్శలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తోన్న సూర్యదేవి అనే మహిళపై కూడా ఆమె ఫిర్యాదు చేయడం గమనార్హం.
 
తన న్యాయవాదితో కలిసి చెన్నైలోని పోరూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో వారిద్దరిపై ఆమె కేసు పెట్టింది. తన వ్యక్తిగత జీవితంపై కొందరు చేస్తోన్న వ్యాఖ్యల పట్ల ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వీడియోలను పోస్ట్ చేయడం సరికాదని విమర్శించింది.
Vanitha Vijayakumar
 
కొన్ని వారాలుగా మీడియాలో తన గురించి అభ్యంతరకర రీతిలో ప్రచారం చేస్తున్నారని మండిపడింది. సూర్యదేవి అనే మహిళ హద్దులు మీరి, తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని తెలిపింది. అలాగే, నిర్మాత రవీంద్రన్‌ సినిమాలు నిర్మించి పేరు తెచ్చుకోకుండా తన యూట్యూబ్‌ చానల్లో సెలబ్రిటీలను వ్యక్తిగత జీవితాలపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారని ఆమె ఆరోపించింది.
 
తన వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యలు చేయడానికి ఆయన ఎవరు? అని నిలదీసింది. కుటుంబ మద్దతు కూడా లేని తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆమె వాపోయింది. తాను ప్రస్తుతం తన ముగ్గురు పిల్లలతో కలసి జీవిస్తున్నానని, ఇటువంటి పరిస్థితుల్లో తోడు కోసం మూడో పెళ్లి చేసుకున్నానని చెప్పింది. తనపై విమర్శలు చేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments