Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నాప్ చేసి రేప్ చేస్తారట.. వగలాడి తమిళ నటి శృతి

సోషల్ మీడియా ప్రసారసాధనమైన ఫేస్‌బుక్‌ మూలంగా పెళ్లి పేరుతో పలువురుని మోసం చేసి, డబ్బులుగుంజిన మాయలాడి తమిళ నటి శృతి ఇపుడు సంచలన ఆరోపణలు చేసింది. తనను కిడ్నాప్ చేసి.. అత్యంత దారుణంగా అత్యాచారం చేస్తామన

Webdunia
ఆదివారం, 5 ఆగస్టు 2018 (10:12 IST)
సోషల్ మీడియా ప్రసారసాధనమైన ఫేస్‌బుక్‌ మూలంగా పెళ్లి పేరుతో పలువురుని మోసం చేసి, డబ్బులుగుంజిన మాయలాడి తమిళ నటి శృతి ఇపుడు సంచలన ఆరోపణలు చేసింది. తనను కిడ్నాప్ చేసి.. అత్యంత దారుణంగా అత్యాచారం చేస్తామని గుర్తుతెలియని అగంతకులు బెదిరిస్తున్నారని వెల్లడించింది. అందుకే ఇంటి నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నట్టు చెప్పుకొచ్చింది.
 
స్వదేశంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తమిళ కుర్రకారుకు తన అందాన్ని ఎరగా వేసి డబ్బు దోచుకుందన్న కేసులో ఈ నటిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. గత ఫిబ్రవరిలో బాలమురుగన్ అనే యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. శృతిని అరెస్టు చేయగా, ఆ తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలైంది. అదేసమయంలో ఆమె సోదరుడు సుభాష్‌తో సహా మరో ముగ్గురిపై పోలీసులు గూండా చట్టం ప్రయోగించారు. 
 
ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత శృతి తాజాగా స్పందిస్తూ, తనను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించింది. కొందరు ఆగంతకులు తనకు ఫోన్ చేసి కిడ్నాప్ చేస్తామని, రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొంది. తాను బయటకు రావాలంటేనే భయపడుతున్నానని తెలిపింది. పోలీసులు తనపై ఒత్తిడి తెస్తున్నారని మహిళా సంఘాలకు, మానస హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు శృతి వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments