Webdunia - Bharat's app for daily news and videos

Install App

చారి 111 నుంచి ఆపరేషన్ రుద్రనేత్ర స్టైలిష్ థీమ్ సాంగ్

డీవీ
మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (16:23 IST)
Vennela Kishore
'చక చక మొదలిక... సాహసాల యాత్ర ఆగదిక... ఇది ఆపరేషన్ రుద్రనేత్ర' అని 'చారి 111' టీమ్ అంటోంది. స్టైలిష్‌గా పిక్చరైజ్ చేసిన థీమ్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్‌లో ఆ సాంగ్ వైరల్ అవుతోంది.
 
'వెన్నెల' కిశోర్ కథానాయకుడిగా నటించిన సినిమా 'చారి 111'. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్రధారి. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా 'చారి 111' థీమ్ సాంగ్ విడుదల చేశారు.
 
''ఒక కన్ను భూగోళం  ఒక కన్ను ఆకాశం విశ్వాన్ని వెతికేద్దాం... పదా!
ఓ... చక చక మొదలిక...   సాహసాల యాత్ర ఆగదిక... 
ఆపరేషన్ రుద్రనేత్ర'' అంటూ సాగిన ఈ పాటను సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాయగా... 'జవాన్' ఫేమ్ సంజీత భట్టాచార్య ఆలపించారు. సైమన్ కె కింగ్ మంచి స్టైలిష్‌ ట్యూన్ అందించారు. స్టైలిష్‌గా డిజైన్ చేసిన లిరికల్ వీడియో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. భారీ సినిమాలకు తీసిపోని రీతిలో సినిమాను తెరకెక్కించారని సాంగ్ చూస్తే తెలుస్తోంది. ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయని అర్థం అవుతోంది.
 
'చారి 111' థీమ్ సాంగ్ విడుదలైన సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ''మా సినిమాలో ఒక్కటే సాంగ్ ఉంది. స్టార్టింగ్ టైటిల్స్‌లో వస్తుంది. ఈ పాటను నేపథ్య సంగీతంలో ఉపయోగించాం. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుంది. వెన్నెల కిశోర్ గారిని ఇంతకు ముందెప్పుడూ ఇలా చూడలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. ఆయన లుక్స్, స్టైలిష్ స్పైగా చేసిన కామెడీ సూపరని చెబుతున్నారు. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది'' అని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా 'చారి 111' థీమ్ సాంగ్ విడుదలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments