వేట్టయ రాజాపై పగ తీర్చుకునేందుకు వస్తున్న 'చంద్రముఖి-2' - ట్రైలర్ రిలీజ్

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (20:14 IST)
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు పి.వాసు తెరకెక్కించిన చిత్రం 'చంద్రముఖి-2'. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15వ తేదీన విడుదలకానుంది. తమిళం, తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంది. లైకా ప్రొడక్షన్ బ్యానరుపై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌లో నిర్మించారు. తెలుగులో రాధాకృష్ణ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానరుపై వెంకట్ ఉప్పుటూరి, వెంకటరత్నం శాఖమూరిలు కలిసి రిలీజ్ చేయనున్నారు.
 
ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ట్రైలర్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఓ థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన హంగులన్నీ చంద్రముఖి-2 చిత్రానికి ఉంది. 17 సంవత్సరాల క్రితం చంద్రముఖి తాను బందీగా ఉంటున్న గది తలుపులు తెరుచుకుని వేట్టయ రాజాపై పగ తీర్చుకోవటానికి ప్రయత్నించి విఫలమైంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తన పగ తీర్చుకోవటానికి వచ్చేస్తోంది. అదెప్పుడు... ఎక్కడ... ఎలా అనేది తెలుసుకోవాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. 
 
ఇందులో రాఘవ లారెన్స్ రెండు షేడ్స్‌లో మెప్పిస్తున్నారు. ఒకటి స్టైలిష్ లుక్ కాగా... మరొకటి వేట్టయ రాజా లుక్. ఇక చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ ఒదిగిపోయారు. బసవయ్య పాత్రలో స్టార్ కమెడియన్ వడివేలు తనదైన కామెడీతో మెప్పించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 
 
ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునేలా ఉందని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్న మరింత పెంచుతోంది. 'చంద్రముఖి 2'తో డైరెక్టర్ పి.వాసు సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 
ఈ చిత్రంలో లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, విఘ్నేష్, రవిమారియ, సృష్టి డాంగే, శుభిక్ష, వై.జి.మహేంద్రన్ రావు రమేష్, సాయి అయ్యప్పన్, సురేష్ మీనన్, శత్రు, టి.ఎం. కార్తీక్ తదితరులు నటించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: రేవంత్ రెడ్డి ఏ అవకాశాన్ని వదులుకోలేదు..

'కర్మ హిట్స్ బ్యాక్' : జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత కామెంట్స్

Prashant Kishore: ఈ PK చెప్పడానికే కాని చేయడానికి పనికిరాడని తేల్చేసిన బీహార్ ప్రజలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments