Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'చంద్రముఖి-2' కథ వినకుండానే ఓకే చెప్పేశా : కంగనా రనౌత్

Kangana Ranaut
, ఆదివారం, 27 ఆగస్టు 2023 (11:23 IST)
పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం చంద్రమఖి-2. సెప్టెంబరు 15వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రి రిలీజ్ వేడుక శనివారం రాత్రి నగరంలో జరిగింది. ఇందులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పాల్గొని ప్రసంగిస్తూ, 'నేను నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్లలో 'చంద్రముఖి 2' వంటి గొప్ప సినిమా చేయలేదు. అసలు విషయమేమంటే.. నాకు అవకాశం కావాలని ఎవరినీ అడగలేదు. తొలిసారి డైరెక్టర్ పి.వాసునే అడిగాను. ఈ సినిమాలో వాసు నా పాత్రతో పాటు ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. లారెన్స్ మాస్టర్ చాలా మందికి పెద్ద స్ఫూర్తి' అని అన్నారు.
 
చిత్ర దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ, 'డైరెక్టర్‌గా ఇప్పటి దర్శకులతో పోటీ పడాలనే ఆలోచిస్తుంటాను. ఆ కోణంలో ఆలోచించే 'చంద్రముఖి 2'ను రూపొందించాను. సుభాస్కరన్ తమిళ చిత్ర సీమకు దొరికిన గొప్ప నిధి. ఓ టెక్నీషియన్‌‌గా నా జర్నీ ప్రారంభమై నాలుగు దశాబ్దాలు అయిన విషయం మీరు చెప్పేంత వరకు నాకు తెలియలేదు. దర్శకుడిగా నేను చేసిన ప్రయాణంలో నాకు తమ సపోర్ట్ అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు, నటుడిగా నన్ను ఆదరించిన వారికి ధన్యవాదాలు' అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గట్టిగా అరిస్తే తొయ్యాలే .. అడ్డమొస్తే లేపాలే'... "స్కంద" ట్రైలర్ రిలీజ్