Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోర్ మాటి పాటని ఆవిష్కరించిన చంద్రబోస్

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (17:01 IST)
chandrabose -goremati song
బంజారా బిగ్ సినిమాస్ పతాకంపై శంకర్ జాదవ్ ,కరిష్మా, అదిరే అభి, సిరి రాజ్ ప్రధాన తారాగణంగా శంకర్ జాదవ్ దర్శకత్వంలో రేఖ్య నాయక్ రెండు బాషలలో నిర్మిస్తున్న చిత్రం తెలుగులో రాజ్ పుత్ (బార్న్ ఆఫ్ వారియర్), బంజారాలో గోర్ మాటి (పవర్ ఆఫ్ యూనిటీ). ఈ చిత్రంలోని సాంగ్ ని చంద్రబోస్ ఆవిష్కరించారు.
 
ఆ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. 'ఇండియాలో 12 కోట్లమంది బంజారాలు ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం. ఖచ్చితంగా ఈ సినిమా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. నటీనటులు అద్భుతంగా నటించారు. దర్శకుడు కూడా ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈ చిత్రాన్ని ఆదరిస్తే ఇలాంటివి మరెన్నో చిత్రాలు వారు మీముందుకు తీసుకువస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
 
జబర్దస్ అదిరే అభి మాట్లాడుతూ.. 'మీరందరూ ఈ సినిమాను చూసి హిట్ చేస్తే... ఇంకొక పది సినిమాలు వస్తాయి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ లాగా బంజారా సినిమా కూడా ఉండాలి' అని అన్నారు.
 
హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన శంకర్ జాదవ్ మాట్లాడుతూ... 'ఈ బ్యానర్‌లో వస్తున్న గోర్ మాటి సినిమాతో ఆగిపోదు. బంజారాను స్థాయిని పెంచుతూ బంజారా జాతి గురించి తెలుపుతూ అందరి మెప్పు పొందేలా ఎన్నో సినిమాలు ఈ బ్యానర్ లో వస్తాయని అన్నారు. డైరెక్టర్, హీరోగా చేయడం అంటే అంత ఈజీ కాదు సినిమా టీమ్ అందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు అందరి సపోర్ట్ తో ఈ సినిమాను పూర్తి చేశాం. మీ ఆశీస్సులు కావాలి' అని అన్నారు.
 
నిర్మాత రేఖ్య నాయక్ మాట్లాడుతూ... 'ఈ సినిమాకోసం అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. సినిమా కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్, డి.ఓ.పి గోపి, మ్యూజిక్ డైరెక్టర్ యమ్. యల్.రాజా,ఎడిటర్ క్రాంతి ఇలా చిత్ర యూనిట్ అందరూ కూడా ఏంతో డెడికేషన్‌ వర్క్ చేశారు. ఇందులో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న శంకర్ ని తమ్ముడుగా భావిస్తాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది మా సినిమాను అందరూ చూసి గొప్ప విజయం సాధించేలా చేయాలని మనస్పూర్తిగా కోరుతున్నాను' అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments