Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ సొంతగూటికి చమ్మక్ చంద్ర..

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (11:41 IST)
Chamak Chandra
జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర.. ఆపై బొమ్మ అదిరింది. అయితే జబర్దస్త్ ను వీడిన కేవలం ఏడాదిన్నర లోపే మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి మెగా బ్రదర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో చమ్మక్ చంద్ర కూడా ఆయన చూపించిన దారిలోనే వెళ్లిపోయాడు.
 
ఇక జబర్దస్త్ షో లో చమ్మక్ చంద్ర కనిపించడు అని అనడంతో అతడి స్కిట్ అభిమానించే వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అదిరింది షో ఆగిపోవడంతో తర్వాత మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్‌లో చేస్తున్నాడు చమ్మక్ చంద్ర.. అయితే అక్కడ ఆయనకు అంత బాగోలేదని.. అసంతృప్తిగా కనిపిస్తున్నాడు.
 
పారితోషికం కూడా బాగానే వస్తుంది కానీ గ్యారెంటీ లేని కామెడీగా మారిపోయింది ఈ కార్యక్రమం. దాంతో ఇప్పుడు మళ్లీ ఆయనే జబర్దస్త్‌కు వస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. సత్తిపండు టీం వచ్చినా కూడా వాళ్లు అయితే చంద్రను బీట్ చేయలేకపోతున్నారు. అందుకే ఈ టీమ్‌ను కూడా తీసేసారు మల్లెమాల టీమ్. ఇప్పటికీ చంద్ర లేని లోటు ఎక్స్ ట్రా జబర్దస్త్‌, జబర్దస్త్‌లో అలాగే కనిపిస్తుంది.
 
ఇప్పుడు చంద్ర బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. జబర్దస్త్ షోను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్ అక్కడ కూడా చేస్తున్నారు. దాంతో చమ్మక్ చంద్ర జబర్దస్త్‌కు రావాలని చూస్తున్నా కూడా అక్కడ మాత్రం ఆయనకు నో ఎంట్రీ బోర్డ్ పెట్టినట్లు తెలుస్తుంది. మరి చంద్ర జబర్దస్త్‌లో మళ్లీ కనిపిస్తాడో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments