Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులు కూడా సెల‌బ్రేట్ చేసుకోండిః వ‌ర్మ సూచ‌న‌

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (20:12 IST)
varma-sam-chaitu
సినిమాల్లో పెళ్ళంటే పందిళ్ళు, త‌ప్పెట్లు, తాళాలు అంటూ పాట‌లు పాడుకోవ‌డం మామూలే. అలాగే విడాకులు అయ్యాక కూడా అలా చేసుకుంటే ఎలా వుంటుంద‌నేది ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఇన్‌డైరెక్ట్‌గా స‌మంత‌, నాగ చైత‌న్య‌కు సూచిస్తున్నారు. వీరిద్ద‌రి వివాహం పెటాకులు అవుతుంద‌ని గ‌త కొంత‌కాలంగా వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంటే స‌మంత అవ‌న్నీ పుకార్లు అంటూ నిన్న‌నే త‌న సోష‌ల్‌మీడియాలో కొంత‌మంది చేత మేచ్ ఫిక్సింగ్ ప్ర‌శ్న‌లు వేయించుకుంది స‌మంత‌. క‌ట్‌చేస్తే ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలేవేరులే అన్న‌ట్లు మ‌రుస‌టి రోజే చైత‌న్య మా బంధం విడిపోతుంద‌న్న‌ట్లు స్టేట్ మెంట్ ఇచ్చాడు.
 
ఇందుకు కార‌ణం వుంది. వీరి కేసు కోర్టులో వుంది. అందుకే లాయ‌ర్ ఇచ్చిన సూచ‌న మేర‌కు వారు ఈ విష‌య‌మై స్పందించ‌లేదని తెలుస్తోంది. అక్టోబ‌ర్ 1న వారి విడాకుల‌కు క్లియ‌రెన్స్ వ‌చ్చింద‌ని తెలిసింది. అందుకే చైత‌న్య త‌మ వివాహ బంధం గురించి మాట్లాడాడు. ఇక నాగ‌చైత‌న్య‌కు రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌ద్ద‌తుగా నిలిచాడు. సమంత, నాగచైతన్య తమ విడాకులను సెలెబ్రేట్ చేసుకోవాలంటూ కితాబిచ్చాడు రాంగోపాల్ వర్మ.
 
వ‌ర్మ త‌న సోష‌ల్‌మీడియాలో ప‌లు విష‌యాల‌ను వివ‌రిస్తూ, గ‌తంలో త‌ను చేసిన పెల్లిమీద వీడియోను కూడా పెట్టాడు. పెళ్లంటే చావు.. విడాకులు అంటూ మళ్లీ జన్మ రావడం అంటూ చెప్పేశాడు. ఇక భార్యాభర్తలుగా విడిపోయినా కూడా స్నేహితుల్లా కలిసి ఉంటామని ఇరువురూ చెప్పడం విశేష‌మే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments