Webdunia - Bharat's app for daily news and videos

Install App

నియంతలు నేలకొరగక తప్పదు.. వివాహం మరణం అయితే.. విడాకులు పునర్జన్మ?

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (20:11 IST)
నటుడు అక్కినేని నాగచైతన్యతో వివాహ బంధం ముగిసిపోయిందని కాసేపటి క్రితమే నటి సమంత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. అంతకుముందే నాగచైతన్య కూడా తాము విడిపోతున్నామని ప్రకటించారు.
 
ఈ సందర్భంగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేసింది. 'నేను బాధలో, విచారంలో ఉన్నప్పుడు మా అమ్మ నాతో చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి. చరిత్రలో ఎప్పుడు ప్రేమ, నిజాయితీనే శాశ్వతంగా ఉంటాయి. కొందరు హంతకులు, నియంతలు ఉంటారు.. వెన్నుపోటు పొడుస్తారు. వారి గెలుపు ఎప్పుడు తాత్కాలికమే. వారు ఎప్పటికయినా నేలకొరగక తప్పదు. ఇదే జరిగి తీరుతుంది. ఇది చరిత్ర చెబుతున్న నిజం. మా అమ్మ నాకు చెప్పిన నిజం` అంటూ సమంత సోషల్ మీడియాలో పేర్కొంది.
 
సమంత-చైతన్య విడాకులపై అక్కినేని నాగార్జున స్పందించారు. వారిద్దరూ విడిపోవడం బాధాకరమని ట్వీటర్ పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య జరిగినవి వ్యక్తిగత, అంతర్గత వ్యవహారమని తెలిపారు. సమంత-చైతన్య ఇద్దరూ నాకిష్టమేనన్నారు. సమంత తమ కుటుంబంతో ఉన్న రోజులన్నీ అద్భుత తీపి గుర్తులన్నారు. వారిద్దరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
 
నాగచైతన్య-సమంత విడాకులపై సంచలన దర్శకుడు ఆర్జీవీ స్పందించాడు. ‘వివాహం మరణం అయితే.. విడాకులు పునర్జన్మ’ అని వ్యాఖ్యానించాడు. పెళ్లిళ్లు వద్దు.. విడాకులు సెలబ్రేట్ చేసుకోండి అని ఆర్జీవీ కామెంట్ చేశాడు. ఎక్కువ పెళ్లిళ్లు కొన్ని రోజులు కూడా ఉండటం లేదు. ‘సంగీత్ సెలబ్రెట్ చేసుకోవాల్సింది పెళ్లి టైమ్‌లో కాదు.. విడాకులు తీసుకున్నప్పుడు నిజమైన సంగీత్ జరుపుకోవాలి’ అని ఆర్జీవీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబుతో పోటీపడి పనిచేస్తా.. 18 గంటలు తప్పదు: రేవంత్ రెడ్డి

పేరు మార్చుకున్నాక కాపుల గురించి, పవన్ గురించి ఆయనకెందుకు?

జగన్‌కు అలాంటి ఇబ్బంది కలిగించని చంద్రబాబు.. ఏంటది?

తొలిస్పీచ్‌తోనే అదరగొట్టిన పవన్.. సభ అంటే అలా వుండాలి.. (వీడియో)

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్.. చంద్రబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

తర్వాతి కథనం
Show comments