Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాయల్ ఆరోపణలతో ఒరిగేదేమీ లేదు.. నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. కస్తూరి

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (10:50 IST)
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ప్రయాణం, ఊసరవెల్లి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ ఘోష్ అత్యాచార ఆరోపణలు చేసింది. ఇంకా అతనిపై కేసు నమోదు చేసింది. అనురాగ్ నన్ను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తుండగా… నేను తప్పించుకున్నాను” అంటూ అనురాగ్ కశ్యప్ పై ఆరోపణలు చేసింది పాయల్ ఘోష్. ఇవి బాలీవుడ్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ట్యాగ్ చేసి మరీ ఈ విషయాన్ని జాతీయం చేసింది పాయల్ ఘోష్. 
 
అయితే ఇలాంటి ఆరోపణల వల్ల ఎటువంటి ఉపయోగం లేదంటూ దక్షిణాదికి చెందిన ఓ సీనియర్ హీరోయిన్ కామెంట్స్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమె మరెవరో కాదు కస్తూరి శంకర్. నిప్పురవ్వ, అన్నమయ్య, ఆకాశవీధిలో, డాన్ శీను వంటి తెలుగు చిత్రాల్లో ఈమె నటించింది. ప్రస్తుతం గృహలక్ష్మి అనే సీరియల్‌లో కూడా నటిస్తుంది. 
 
ఇక ఈమె పాయల్ ఆరోపణలు పై స్పందిస్తూ..''అనురాగ్‌పై నీవు చేసిన ఆ ఆరోపణలు కోర్టులో నిలబడలేవు. నేరాన్ని స్పష్టంగా ధృవీకరించే ఆధారాలు లేకుండా లైంగిక వేధింపుల ఆరోపణలు వల్ల నీకు జరిగే న్యాయం ఏమీ ఉండదు. వీటి వల్ల ఇద్దరిలో ఒక్కరి కెరీర్ మాత్రం నాశనమవుతుంది'' అంటూ కస్తూరి చెప్పుకొచ్చింది. 
 
ఇదిలా ఉండగా.. ఈ వ్యాఖ్యలను చూసిన ఓ నెటిజన్.. "ఇదే మీ కుటుంబంలోనో, లేక మీకు అత్యంత సన్నిహితమైన మహిళలకు జరిగితే.. మీరు ఇలాగే ప్రస్తావిస్తారా..?" అని ప్రశ్నించాడు. దానికి కస్తూరి రియాక్ట్ అవుతూ.. "నా కుటుంబంలో ఏంటి.. నేనే అలాంటి పరిస్థితులను ఫేస్ చేశాను. నన్ను కూడా వేధించారు. నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.." అంటూ జవాబిచ్చింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం