Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

లవ్ జీహాద్ ఉచ్చులో సంజనా గల్రానీ!

Advertiesment
Drug Mafia
, ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (10:57 IST)
కన్నడ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన మాదకద్రవ్యాల వ్యవహారంలో నటి సంజనా గల్రానీ అరెస్టయ్యారు. ఆమెతో పాటు.. మరో నటి రాగిణి ద్వివేదీని కూడా బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి, పరప్పణ అగ్రహార జైలులో ఉంచారు. అయితే, ఇపుడు సంజనకు సంబంధించిన ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె లవ్ జీహాద్ ఉచ్చులో పడినట్టు సమాచారం. 
 
ప్రస్తుతం రిమాండ్ నిందితురాలిగా ఉన్న నటి సంజనా గల్రానీ, లవ్ జీహాద్‌లో చిక్కుకున్నారని, ఆమె మతం మార్చుకుని మహీరాగా మారారని ప్రముఖ సమాచార హక్కుల కార్యకర్త ప్రశాంత్ సంబర్గి సంచలన ఆరోపణలు చేశారు. 2018లోనే ఈ ఘటన జరిగిందని, ఆమె హిందూ మతాన్ని వీడి, ముస్లిం మతానికి మారిపోయారని చెబుతూ, అందుకు సాక్ష్యంగా ఆమె మతాన్ని మారుస్తూ ముస్లిం పెద్దలు ఇచ్చిన సర్టిఫికెట్‌ను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
 
ఆమె పూర్తి అర్చనా మనోహర్ గల్రానీ కాగా ముస్లిం మతంలోకి మారిన తర్వాత ఆమె పేరు మహీరాగా మార్చారు. పైగా, ఆమె అజీజ్ మాయా అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లి కూడా చేసుకున్నట్టు సమాచారం.  ప్రస్తుతం ఈ వార్త ఈ వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది.
webdunia
 
మరోవైపు, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంజనపై బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చార్జ్ షీట్‌ను రూపొందించి, కోర్టుకు అందించారు. ఆమెను దాదాపు వారం రోజుల పాటు విచారించిన పోలీసులు, పలు కీలక వివరాలను సేకరించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఎఫ్ఐఆర్‌లో ఆమె పేరు సంజనా గల్రానీ అని మాత్రమే పేర్కొన్నారు. మహీరా అన్న పేరు ఎక్కడా లేదని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్యాంట్ జిప్ ఓపెన్ చేసి బలవంతం చేయబోయాడు : పాయల్ ఘోష్