Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ్ నిజంగానే లోఫర్‌ అట!

Webdunia
గురువారం, 26 మే 2016 (11:21 IST)
ఇడియట్‌, పోకిరి, లోఫర్‌ వంటి టైటిల్స్‌తో.. సినిమా చేసే పూరీ జగన్నాథ్‌ నిజంగానే లోఫర్‌.. పోకిరి అంటూ ఫిలింగనర్‌లో కామెంట్లు విన్పిస్తున్నాయి. దానికి కారణం లేకపోలేదు. ఇంతకుముందు తాను తీసిన లోఫర్‌ సినిమా ఫెయిల్‌ కావడంతో ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు తనను బెదిరించారని..  దర్శకుడు పూరీ జగన్నాథ్‌ పోలీసు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ ముగ్గురూ.. అసలు ఈ విషయం తమకు తెలీదని.. ఆయన కార్యాలయానికి వెళ్లడం అసాధ్యమని తేల్చారు. 
 
అసలు ఈ వ్యవహారంలో ఉన్నత పోలీసు అధికారి సలహాతో.. పూరీ.. ఇలా కేసుపెట్టాడనీ.. ఏ సెక్షన్‌ కింద పెడతారంటూ.  లా పాయింట్‌ను ఆ ముగ్గురు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. దానికితోడు. ఆ పోలీసు అధికారిపై రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో.. అసలికో మోసం వస్తుందని కాబోలు.. సదరు పోలీసు అధికారి రాజీకి వచ్చినట్లు తెలిసింది. 
 
దీంతో.. పూరీతోనే చెప్పి కేసు విత్‌డ్రా చేయించేలా చేసినట్లు తెలిసింది.  దాంతో గతంలో తాను ఇచ్చిన.. అభిషేక్‌ నామా - రామ్‌ దాస్‌ నాయుడు - కాళి సుధీర్‌ లు తనను బెదిరిస్తున్నారంటూ.. పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్‌ ను పూరి జగన్నాధ్‌ ఉపసంహరించుకున్నాడు. ఈ విషయాన్ని జూబ్లీహిల్స్‌ పోలీసు సిఐ. రమేష్‌ వెల్లడించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments