Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు స‌ర‌స‌న ఐశ్వ‌ర్య‌రాయ్..? ఇది నిజ‌మా..?

Webdunia
శనివారం, 13 జులై 2019 (17:48 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ భారీ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ భారీ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రామ‌చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చిరు స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించ‌గా, అమితాబ్ కీల‌క పాత్ర‌ను పోషించారు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.
 
ఈ సినిమా త‌ర్వాత చిరు.. బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న అందాల తార న‌య‌న‌తార‌నే న‌టింప చేయాలి అనుకున్నార‌ట‌. అయితే...లేటెస్ట్ న్యూస్ ఏంటంటే...కొర‌టాల‌ ఐశ్వ‌ర్య రాయ్ అయితే బాగుంటుంద‌ని చెప్ప‌డం.. దీనికి చిరు, చ‌ర‌ణ్ ఓకే అన‌డంతో  కాంటాక్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. 
 
ఈ వార్త ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ మూవీలో ఐష్ న‌టించ‌డం క‌న్ ఫ‌ర్మ్ అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి..ప్ర‌చారంలో ఉన్న వార్త నిజ‌మేనా కాదా అనేది తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments