సైరా నరసింహారెడ్డి సినిమా కోసం మెగాస్టార్ అభిమానలు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. చిరంజీవి 151 సినిమాను భారీ బడ్జెట్‌తో ఆయన కుమారుడు రాంచరణ్ నిర్మిస్తున్నారు. మొదట్లో తక్కువ బడ్జెట్‌తోనే ప్లాన్ చేశారు కానీ దర్సకుడు సురేంద్రరెడ్డి ఒక్కొక్క సీన్‌ను రసవత్తరంగా తీస్తుండడంతో డబ్బులు భారీగానే ఖర్చు పెట్టాల్సి వచ్చింది.
అయితే సినిమాను దక్షిణాది రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు సిద్థమయ్యారు. కానీ మొదట్లో సినిమా హక్కులను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చిరంజీవి, రాంచరణ్‌లు ఆలోచనలో పడిపోయారు. కానీ అదృష్టం తండ్రీకొడుకులను వరించింది. రెండురోజుల క్రితమే సినిమాకు సంబంధించి డబ్బింగ్‌ను పూర్తి చేశారు చిరంజీవి.
కర్ణాటక హక్కులను 35 కోట్లకు కొన్నారు. కర్ణాటకలో తెలుగు సినిమాలకు మంచి ఆదరణ ఉంది. దీంతో తండ్రీకొడుకులు ఆనందంలో ఉన్నారట. దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్రాల్లోను ఇప్పటికే హక్కులను కొనేశారు. దీంతో సినిమా షూటింగ్ పూర్తికాకుండానే డబ్బులు మొత్తం వచ్చేయడంతో ఇద్దరూ సంతోషంతో ఉన్నారట.