స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రంలోని పాటలు జనవరి ఆరో తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే, ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.
ఇందులోభాగంగా, అల వైకుంఠపురంలో సినిమాలోని సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. బుట్టబొమ్మ సాంగ్‌తో మొత్తం నాలుగు సాంగ్స్‌ను రిలీజ్ చేశారు. ఈ నాలుగు కూడా ఆకట్టుకున్నాయి. ఇందులో రాములో రాములా సాంగ్, సామజవరగమన పాట సూపర్ హిట్ కొట్టాయి. ఇప్పుడు బుట్టబొమ్మ సాంగ్ కూడా మంచి విజయం సాధించింది.
ఇక ఇదిలావుంటే, ఈ సాంగ్‌కు సంబంధించిన మేకింగ్‌కు సంబంధించిన చిన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే పై షూట్ చేసిన ఈ సాంగ్ ఎంత స్టైలిష్‌గా ఉంటుందో మేకింగ్ వీడియో చెప్పకనే చెప్తున్నది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతున్నది.
Here’s a special sneak peak of #buttabomma for you’ll...shhhh...don’t tell anyone