Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#AlaVaikunthapurramuloo బుట్టబొమ్మ లిరికల్ సాంగ్ (video)

Advertiesment
#AlaVaikunthapurramuloo బుట్టబొమ్మ లిరికల్ సాంగ్ (video)
, బుధవారం, 25 డిశెంబరు 2019 (11:18 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సినిమా అల వైకుంఠపురంలో. ప్రస్తుతం ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు మంచి హిట్ అయ్యాయి.

తాజాగా నాలుగో పాటను సినీ యూనిట్ విడుదల చేసింది. మంచి ఫ్యామిలీ, ఎమోషనల్ ఎంటెర్టైనెర్‌గా పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. 
 
తాజాగా ఈ సినిమా నుండి బుట్ట బొమ్మ అనే పల్లవితో సాగే నాలుగవ సాంగ్‌ని కాసేపటి క్రితం యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. బాలీవుడ్ ఫేమస్ సింగర్ అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ సాంగ్ ఎంతో మెలోడియస్‌గా సాగుతూ యువత హృదయాలను తాకుతోంది.

ఈ సాంగ్‌కు ఆకట్టుకునే ట్యూన్‌ని సంగీత దర్శకుడు తమన్ అందించగా, వినసొంపైన సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి సమకూర్చారు. ఈ పాటను మీరూ ఈ వీడియో ద్వారా వినండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేతికి అసలు గన్ ఇస్తే..