Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల.. వైకుంఠపురంలోని బుట్టబొమ్మ సాంగ్ రిలీజ్ (వీడియో)

Webdunia
ఆదివారం, 22 డిశెంబరు 2019 (12:32 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం అల.. వైకుంఠపురములో... ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 12వ తేదీన విడుద‌లకానుంది. చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా థ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన సాంగ్స్‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. 
 
ఇప్పటికే సామ‌జ‌వ‌ర‌గ‌మనా, రాములో రాములా, ఓ మై గాడ్ డాడీ అనే సాంగ్స్ విడుదల చేయగా, వీటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక‌ బుట్ట బొమ్మ సాంగ్ టీజ‌ర్‌ని రెండు రోజుల క్రితం విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించిన‌ప్ప‌టికి, సాంకేతిక కార‌ణాల వ‌ల‌న వీలు కాలేదు.
 
అయితే, ఆదివారం మెలోడి సాంగ్‌ సాంగ్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. రామ‌జోగ‌య్య శాస్త్రి ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా, ఆర్మాన్ మాలిక్ పాట పాడారు. ఈ సాంగ్ కూడా సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఫుల్ సాంగ్ డిసెంబ‌ర్ 24న విడుద‌ల చేయ‌నున్నారు.
 
గీతా ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని బ్యానర్లపై ఈ సినిమాను అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్‌కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్రఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు నటిస్తుంటగా, ఈ సినిమాకి థమన్.ఎస్ సంగీతం అందిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాత ప్రియుడైన భర్త పాతబడిపోయాడా? కొత్త ప్రియుడు స్వర్గం చూపించాడా? కాజీపేట క్రైం స్టోరీ

శివరాత్రితో మహా కుంభమేళా ముగింపు.. స్మార్ట్‌ఫోన్‌ను మూడుసార్లు గంగానదిలో ముంచింది...

బూతులకు వైసిపి పర్యాయపదం, తట్టుకున్న సీఎం చంద్రబాబుకి హ్యాట్సాఫ్: డిప్యూటీ సీఎం పవన్

Purandeswari: జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడి ఉండాలి.. పురంధేశ్వరి

TTD: తిరుమలలోని అన్నదానం సత్రం వద్ద తొక్కిసలాట.. బాలుడి మృతి.. నిజమెంత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments