Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిరాం శంకర్ హీరోగా 'బంపర్ ఆఫర్ - 2'

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (13:58 IST)
Sairam Shankar
ఓ చిత్రం విజయం సాధిస్తే దానికి సీక్వెల్ చేయటం ఓ పద్ధతి. అదే చిత్రం పేరును కొనసాగిస్తూ కొత్త కథను తెరకెక్కించడం మరో పద్ధతి. ఇప్పుడీ రెండో పద్దతిలోనే ఓ చిత్రం ఈరోజు పురుడు పోసుకుంది. పూరీ సోద‌రుడు సాయిరాం శంకర్ హీరోగా గతంలో రూపొందిన 'బంపర్ ఆఫర్' చిత్రం, సాధించిన విజయం ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది. ఇప్పుడు ఆయనే హీరోగా అదే పేరును కొనసాగిస్తూ 'బంపర్ ఆఫర్ - 2' పేరుతో ఓ చిత్రం నిర్మితం కానుంది.
 
దర్శకుడు పూరి జగన్నాథ్ ఆశీర్వాదం తో, సురేష్ విజయ ప్రొడక్షన్స్, సినిమాస్ దుకాన్ సంయుక్త నిర్మాణంలో సురేష్ యల్లంరాజు, సాయి రామ్ శంకర్ నిర్మాతలుగా 'బంపర్ ఆఫర్ 2' చిత్రాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు.
 
'బంపర్ ఆఫర్' విజయం నేపథ్యంలో పన్నెండు సంవత్సరాల తర్వాత అదే పేరు మీద రెండవ భాగం చేస్తున్నారు. అయితే ఇది సీక్వెల్ కాదు, రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నారు. 'బంపర్ ఆఫర్' చిత్రానికి దర్శకత్వం వహించిన జయ రవీంద్ర ఈ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి అశోక స్క్రిప్ట్ రచన చేశారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఉగాది శుభాకాంక్షలతో ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతుంది. చిత్రం లోని హీరోయిన్స్, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సురేష్ యల్లంరాజు.
ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చుతుండగా, పప్పు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు మరియు ఆర్ట్ డైరెక్టర్ గా వర్మ  ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments