'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
గురువారం, 4 డిశెంబరు 2025 (19:24 IST)
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'అఖండ-2'. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మించింది. సంయుక్తా మీనన్ హీరోయిన్. రవి పినిశెట్టి కీలక పాత్రను పోషించారు. అయితే, గురువారం రాత్రి నుంచి ఈ చిత్రం ప్రీమియర్ షోలను దేశ వ్యాప్తంగా ప్రదర్శించాల్సివుంది. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా ఈ షోలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. 
 
ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక కారణాల వల్ల ఇండియాలో ఈ రోజు జరగాల్సిన ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నాం. మా వంతు మేం ఎంతగానో ప్రయత్నించాం. కానీ, కొన్ని అంశాలు మా నియంత్రణలో ఉండవు. అసౌకర్యానికి క్షమించండి. అని పోస్టులో పేర్కొంది. అయితే, ఓవర్సీస్‌లో మాత్రం ఈ చిత్రం ప్రీమియర్ షోలను యధావిధిగా ప్రదర్శితమవుతాయని ప్రకటించింది. 
 
బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'అఖండ' మూవీకి సీక్వెల్‌గా 'అఖండ-2' వస్తుండటం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనివున్నాయి. ప్రీమియర్ షోల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు ఈ రద్దుతో కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, ముందుగా ప్రకటించినట్టుగానే ఈ నెల 5వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదలకానుంది. ఈ ప్రీమియర్ షోల రద్దు వల్ల సాధారణ ప్రదర్శనలపై ఎలాంటి ప్రభావం చూపబోతని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Stray Dogs: వీధికుక్కలతో తంటాలు.. వరంగల్‌లో వ్యక్తిని వెంబడించాయి.. డ్రైనేజీలో పడి మృతి

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments