Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు నష్టం దావా వేస్తారు... ఫ్యాన్స్ శాంతియుతంగా ఉండాలి : పవన్ పిలుపు

తన అభిమానులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఓ పిలుపునిచ్చారు. అభిమానులు శాంతియుతంగా ఉండాలని, ఎలాంటి విధ్వంసాలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తిచేశారు.

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (09:11 IST)
తన అభిమానులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఓ పిలుపునిచ్చారు. అభిమానులు శాంతియుతంగా ఉండాలని, ఎలాంటి విధ్వంసాలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తిచేశారు. టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ప్రోత్సాహంతో యువ నటి శ్రీరెడ్డి తనపై చేసిన వ్యక్తిగత దూషణల విషయంపై తెలుగు న్యూస్‌ ఛానెల్‌ టీవీ9 కొన్ని రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు అసభ్యకరంగా డిబేట్లు నిర్వహించిందంటూ పవన్‌ మండిపడిన విషయం తెల్సిందే. టీవీ9 శ్రీని రాజు ఫొటోలను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆయనపై పవన్ తీవ్ర ఆరోపణలు కూడా చేశారు.
 
'రేపు శ్రీని రాజు తనపై పరువునష్టం దావా వేస్తున్నారని, తన ఫ్యాన్స్‌ శాంతియుతంగా ఉండాలని, ఎటువంటి విధ్వంసకర చర్యలకు పాల్పడకూడదని కోరారు. అలాగే, తాను కూడా ఆ ఛానెల్‌ హెడ్‌లపై సుదీర్ఘంగా న్యాయపరమైన యుద్ధం చేస్తానని ప్రకటించారు. అలాగే మరో ట్వీట్ చేస్తూ, మన సోదరీమణులు, అమ్మలు, కూతుళ్లను దుర్భాషలాడుతూ కథనాలు ప్రసారం చేసే టీవీ9, టీవీ5, ఏబీఎన్ ఛానళ్లను బహిష్కరించాలని, నిస్సహాయులైన వారికి సాయం చేయాల్సిందిపోయి, వారిని అశ్లీలంగా చూపిస్తూ వ్యాపారం చేసుకోవాలని ఆ ఛానల్స్‌ చూస్తున్నాయని, వాటిని బాయ్‌కాట్ చేయాలని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments