Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనాకు ఊరట... బీఎంసీ అధికారులకు హైకోర్టు నోటీసు

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (15:38 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ముంబై హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. అదేసమయంలో బృహన్ ముంబై నగర పాలక సంస్థ అధికారులకు మాత్రం హైకోర్టు నోటీసులు పంపించింది. కంగనా పిటిషన్‌పై సమాధాన పత్రం దాఖలు చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. 
 
ముంబై బాంద్రా బంగ్లాలో అక్ర‌మంగా మార్పులు జ‌రిగిన‌ట్లు బీఎంసీ అధికారులు చెబుతున్నారు. దానిలో భాగంగానే ఇంటికి నోటీసులు అంటించిన‌ట్లు బీఎంసీ అధికారులు చెప్పారు. బుధవారం మ‌ధ్యాహ్నం 12.30 నిమిషాల‌కు కంగ‌నా ఆఫీసుకు వెళ్లిన బీఎంసీ అధికారులు బుల్డోజ‌ర్ల‌తో ఆ భవనంలో అక్రమంగా మార్పులు చేర్పులు చేసిన ప్రాంతాన్ని కూల్చివేశారు. 
 
మ‌రో వైపు బిల్డింగ్ కూల్చివేత‌ను అడ్డుకోవాలంటూ కంగ‌నా త‌ర‌పు న్యాయ‌వాది కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. బంగళాలో అక్రమ మార్పులు జరిగాయని ఆరోపిస్తూ బృహన్ముంబై నగర పాలక సంస్థ (బీఎంసీ) చేపట్టిన చర్యలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆమె పిటిషన్‌పై సమాధానం దాఖలు చేయాలని ఆదేశిస్తూ, నోటీసులు జారీ చేసింది. 
 
కాగా, తన బంగళాలో అక్రమాలు జరిగాయంటూ బీఎంసీ కూల్చివేతలకు పాల్పడటంపై కంగన తీవ్రంగా మండిపడ్డారు. తాను శివసేనతో పోరాటం చేస్తున్నందువల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ముంబై నిజంగానే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరు అయిందంటూ మండిపడ్డారు 
 
ఇదిలావుండగా, బుధవారం ఆమె ఇచ్చిన ట్వీట్‌లో బాలీవుడ్ ఈ ఆగడాలను గమనించాలని కోరారు. 'నా ఇంట్లో ఎటువంటి చట్టవిరుద్ధ నిర్మాణం లేదు. అంతేకాకుండా ప్రభుత్వం కోవిడ్ సమయంలో కూల్చివేతలను సెప్టెంబరు 30 వరకు నిషేధించింది. బుల్లీవుడ్! ఇప్పుడు దీనిని గమనించు, నియంతృత్వం ఇలాగే ఉంటుంది. ప్రజాస్వామ్యం చచ్చింది' అంటూ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments