Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేత.. ముంబైలో ఉద్రిక్తత

Advertiesment
కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేత.. ముంబైలో ఉద్రిక్తత
, బుధవారం, 9 సెప్టెంబరు 2020 (13:02 IST)
బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కార్యాలయాన్ని బృహ‌న్‌ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు బుధవారం కూల్చివేశారు. ముంబైలోని పాలి హిల్స్‌లో ఆ ఆఫీసు ఉన్న‌ది. బాంద్రా బంగ్లాలో అక్ర‌మంగా మార్పులు జ‌రిగిన‌ట్లు బీఎంసీ అధికారులు చెబుతున్నారు. దానిలో భాగంగానే ఇంటికి నోటీసులు అంటించిన‌ట్లు బీఎంసీ అధికారులు చెప్పారు. 
 
బుధవారం మ‌ధ్యాహ్నం 12.30 నిమిషాల‌కు కంగ‌నా ఆఫీసుకు వెళ్లిన బీఎంసీ అధికారులు బుల్డోజ‌ర్ల‌తో ఆ భవనంలో అక్రమంగా మార్పులు చేర్పులు చేసిన ప్రాంతాన్ని కూల్చివేశారు. మ‌రో వైపు బిల్డింగ్ కూల్చివేత‌ను అడ్డుకోవాలంటూ కంగ‌నా త‌ర‌పు న్యాయ‌వాది కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 
 
చాన్నాళ్ల నుంచి స్వంత రాష్ట్రం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఉంటున్న కంగ‌నా ర‌నౌత్‌.. బుధవారం ఉద‌యం ముంబైకి బ‌య‌లుదేరింది. చంఢీఘ‌డ్ మీదుగా ఆమె ముంబై చేరుకోనుంది. అయితే త‌న బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించిన ఫోటోల‌ను కంగ‌నా ట్వీట్ చేసింది.
webdunia
 
"నేనెప్పుడూ త‌ప్పు చెప్ప‌లేదు, నా శ‌త్రువులు నిజ‌మ‌ని ప్రూవ్ చేశారు, అందుకే ఇప్పుడు ముంబై పీవోకేగా మారింద‌ని" త‌న ట్వీట్‌లో కంగ‌నా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి, కంగనాకు మాట‌ల యుద్ధం సాగింది. 
 
శివ‌సేన పార్టీతో వైరానికి దిగిన కంగ‌నా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ముంబై పోలీసుల తీరును కూడా ఖండించింది. శివ‌సేన తీరును త‌ప్పుప‌ట్ట‌డం వ‌ల్లే నాపై వాళ్లు క‌క్ష క‌ట్టార‌ని కంగ‌నా ఆరోపిస్తోంది. రెండు రోజ‌ల క్రితం కేంద్ర ప్ర‌భుత్వం కంగ‌నాకు వై ప్ల‌స్ భ‌ద్ర‌త‌ను క‌ల్పించింది. వీటిని జీర్ణించుకోలేని శివసేన ఈ తరహా చర్యలకు పాల్పడిందని ఆరోపించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిసెంబరు నాటికి 5జీ స్మార్ట్ ఫోన్లు... ప్లాన్ చేస్తున్న జియో