Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ మృతి కేసు : బాలీవుడ్ నటి రియా చక్రవర్తి భారీ ఊరట

వరుణ్
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (12:34 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో బాలీవుడ్ నటి, ఆమె ప్రియురాలు రియా చక్రవర్తి భారీ ఊరట లభించింది. రియా విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్‌ను సీబీఐ జారీ చేసింది. ఈ లుకౌట్ నోటీస్‌ను బాంబే హైకోర్టు జారీచేసింది. తాము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఈ ఆర్డర్‌పై నాలుగు వారాలు పాటు స్టే విధించాలన్న సీబీఐ తరపు న్యాయవాది విన్నపాన్ని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. 
 
గత 2020 జూన్ 14వ తేదీన ముంబైలోని తన నివాసంలో సుశాంత్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. అయితే, సుశాంత్‌‌ది ఆత్మహత్య కాదని, రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ సుశాంత్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారంటూ ఆయన తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. 
 
ఈ క్రమలో రియా చక్రవర్తిని ఈడీ ప్రశ్నించింది. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి సుప్రీంకోర్టు అప్పగించింది. సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చిందనే ఆరోపణలు రియా, ఆమె సోదరుడు షోవిక్, తండ్రి ఇంద్రజిత్ ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ జైలుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలో వీరు విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్‌ను కూడా జారీ చేసింది. దీంతో వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించగా, లుకౌట్ సర్క్యులర్‌ను రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను పరీక్షించిన డీఆర్డీవో

రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత సురవరం : సీఎం రేవంత్ రెడ్డి

కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇకలేరు... వైద్య కాలేజీకి మృతదేహం దానం

అదనపు కట్నం కోసం కోడలి జట్టు పట్టి లాగి కొడుతూ... నిప్పంటించిన అత్త... ఎక్కడ?

భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. ట్రంప్‌కు నిక్కీ హేలీ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments