Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గంజాయితో పట్టుబడిన షణ్ముఖ్ జశ్వంత్... అన్నయ్యకు పెళ్లి ఇంతలో?

Advertiesment
shanmukh jaswanth
యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్‌లు, సిరీస్‌లతో మంచి పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్.. బిగ్ బాస్‌కి వెళ్లి మరింత పాపులర్ అయ్యాడు. తెలుగులో అత్యధిక సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న సింగిల్ యూట్యూబర్‌గా కూడా షణ్ముఖ్ రికార్డు సృష్టించాడు. ఇటీవల ఓ కేసు నిమిత్తం షణ్ముఖ్ సోదరుడి వద్దకు పోలీసులు వెళ్లగా.. షణ్ముఖ్, అతని సోదరుడు సంపత్ గంజాయితో పట్టుబడ్డారు.
 
షణ్ముఖ్ అన్నయ్య సంపత్ పెళ్లి మరికొద్ది రోజుల్లో జరగనుంది. అయితే సంపత్ తనను పదేళ్లుగా ప్రేమిస్తున్నాడని, ఇప్పుడు తనను మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని మోనిక అనే అమ్మాయి సంపత్‌పై కేసు పెట్టింది. 
 
అంతేగాకుండా వారి నుంచి 16 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది. కాగా, గంజాయి కేసులో సంపత్, షణ్ముఖ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
గంజాయితో పోలీసులకు చిక్కిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ వార్తల్లో నిలిచాడు, అయితే షణ్ముఖ్ అంతకుముందు హిట్ అండ్ రన్ కేసులో వైరల్ అయ్యాడు. వారిని అదుపులోకి తీసుకుని నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిద్ధార్థ్ రాయ్ కంటెంట్ చూసాక నేను జెలసీ ఫీలయ్యా.: కోన వెంకట్