కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

ఠాగూర్
మంగళవారం, 11 నవంబరు 2025 (17:27 IST)
కోలీవుడ్ అగ్రహీరో అజిత్ కుమార్ ఇంటికి అగంతకులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. అజిత్‍తో పాటు కాంగ్రెస్ పార్టీ తమిళనాడు శాఖ కార్యాలయమైన సత్యమూర్తి భవన్‌కు కూడా ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన చెన్నై నగర పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. 
 
కాగా, గత కొన్ని రోజులుగా చెన్నై మహానగరంలోని పలువురు సినీ రాజకీయ నేతల నివాసాలు, కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో చెన్నైలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్, ఈసీఆర్‌లో ఉన్న నటుడు అజిత్ కుమార్ ఇల్లు, ఈవీసీ ఫిలిం సిటీ తదితర చోట్ల బాంబులు ఉన్నట్లు మంగళవారం డీజీపీ కార్యాలయానికి ఇ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి.
 
దీంతో అప్రమత్తమైన బాంబు నిర్వీర్య ప్రత్యేక బృందం నిపుణులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా అబద్ధమని తెలిసింది. అంతేకాకుండా ఎస్వీ శేఖర్, నటి రమ్యకృష్ణ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం నటి త్రిష ఇల్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనకు పాల్పడుతున్న వ్యక్తుల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 6 లక్షలు సుపారీ ఇచ్చి కన్నకొడుకునే హత్య చేయించిన తల్లి, కారణం ఏంటి?

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు : ఎన్.ఐ.ఏ దర్యాప్తు

టీవీకేకు ఉమ్మడి ఎన్నికల చిహ్నాన్ని పొందే ప్రక్రియ ప్రారంభం

ఏపీలో ప్రతి 50 కిమీకి ఒక పోర్టు నిర్మాణం : సీఎం చంద్రబాబు

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో కేవలం 47 శాతం పోలింగ్ మాత్రమే నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

తర్వాతి కథనం
Show comments