Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్ సినిమాల్లో ఛాన్స్ కోసం ఎగబడుతున్న బాలీవుడ్ తారలు..

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (13:50 IST)
గతంలో దక్షణాది చిత్రాలను చిన్న చూపు చూసిన బాలీవుడ్ తారలు ప్రస్తుతం దక్షణాది చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమకు తాము గొప్పవాళ్లు అని ఫీలయినవాళ్లే ఇప్పుడు సౌత్ సినిమాల్లో అవకాశాల కోసం క్యూ కడుతున్నారు. తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ నటీనటులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 
 
తెలుగులో తెరకెక్కుతోన్న స్టార్ హీరోల సినిమాలన్నింటిలోనూ బాలీవుడ్ స్టార్స్ తళుక్కుమంటున్నారు. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ట్రిపుల్‌ ఆర్‌లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు హీరో అజయ్ దేవగణ్ మరో ఇంపార్టెంట్ రోల్‌లో నటిస్తున్నాడు.
 
త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో హిందీ సీనియర్ నటుడు నానా పటేకర్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. సైరాలో బిగ్ బీ అమితాబ్ మెగాస్టార్‌కి గురువుగా నటిస్తున్నాడు. మరోవైపు ప్రభాస్ నటిస్తోన్న సాహో సినిమాలో హీరోయిన్ శ్రద్ధాకపూర్‌తో పాటు నీల్ నితిన్ ముకేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఆదిత్య శ్రీవాస్తవ్, ఇవిలిన్ శర్మ ఇలా అరడజను మంది హిందీ నటీనటులు నటిస్తున్నారు.
 
తమిళ సినిమాలలో కూడా హిందీ నటీనటుల హడావిడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎస్ జె సూర్య లీడ్ రోల్‌లో నటిస్తోన్న 'ఉయర్నద మణిదన్' సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 
 
అంతేకాదు విజయ్, అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీలో షారుక్ ఖాన్ గెస్ట్ అప్పీయరెన్స్‌లో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇలా బాలీవుడ్ స్టార్ హీరోల దగ్గరి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల దాకా సౌత్ సినిమాల్లో నటించేందుకు క్యూ కడుతున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments