Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్‌ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఫస్ట్ లుక్

Webdunia
శనివారం, 29 జులై 2023 (13:18 IST)
Sanjay Dutt
ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్‌’. వారి గత బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కొద్ది రోజుల క్రితం ముంబైలో ఒక ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించడంతో ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రామ్ స్టైలిష్ మేకోవర్‌ అయ్యారు. విషు రెడ్డి సీఈవో.
 
 మేకర్స్ ఈ రోజు ఒక బిగ్ అప్‌డేట్‌తో వచ్చారు. బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌దత్‌ డబుల్‌ ఇస్మార్ట్‌లో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఆయన మొదటి షెడ్యూల్‌ షూట్‌లో జాయిన్ అయ్యారు. ఈరోజు, సంజయ్ దత్ పాత్రను బిగ్ బుల్‌గా పరిచయం చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
 
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఫంకీ హెయిర్‌డో, గడ్డం, చెవిపోగులు, ఉంగరాలు, ఖరీదైన గడియారం, ముఖం, వేళ్లపై పచ్చబొట్టుతో అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు సంజయ్ దత్. ఈ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సంజయ్ దత్ సిగార్ తాగుతున్నట్లు కనిపించారు. గన్స్ అతని వైపు గురిపెట్టినట్లు కనిపిస్తున్నాయి. సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
 
తన నటీనటులను బెస్ట్ మాస్ అప్పీలింగ్‌ లో ప్రజంట్ చేయడంతో దిట్ట అయిన పూరి జగన్నాథ్ 'డబుల్ ఇస్మార్ట్‌' లో సంజయ్ దత్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించనున్నారు.
 
రామ్, సంజయ్ దత్‌లను తెరపై కలిసి చూడటం అభిమానులకు, సినీ ప్రియులకు ఎక్సయిటింగ్ గా ఉంటుంది. ఈ వైల్డ్ కాంబినేషన్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
 
సినిమా కోసం పని చేస్తున్నందుకు తన ఆనందాన్ని పంచుకున్నారు సంజయ్ దత్. ''డైరెక్టర్ ఆఫ్ ది  మాసెస్ పూరీ జగన్నాధ్ జీ, యంగ్ ఎనర్జిటిక్ ఉస్తాద్  రామ్ తో కలసి సైన్స్‌ ఫిక్షన్ మాస్ ఎంటర్ టైనర్  ' డబుల్ ఇస్మార్ట్‌' లో బిగ్ బుల్ పాత్ర చేయడం ఆనందంగా, చాలా గర్వంగా ఉంది. ఈ సూపర్-టాలెంటెడ్ టీమ్‌తో జతకట్టడానికి సంతోషిస్తున్నాము. 2024 మార్చి 8 ' డబుల్ ఇస్మార్ట్‌' విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అని ట్వీట్ చేశారు.
 
ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు మేకర్స్.
డబుల్ ఇస్మార్ట్  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments