Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ స్టార్ డినో మోరియా.చేతిలో మెషిన్ గన్‌

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (13:23 IST)
Dino Morea
అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అఖిల్ లుక్ లను చిత్రయూనిట్ విడుదల చేసింది. నేడు బాలీవుడ్ స్టార్ డినో మోరియాను  'ది గాడ్' గా పరిచయం చేశారు. రాజ్, అక్సర్, జూలీ మొదలైన చిత్రాలలో తన పాత్రలకు పేరుపొందిన బాలీవుడ్ స్టార్ డినో మోరియా..చేతిలో మెషిన్ గన్‌తో పోస్టర్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. అతని పొడవాటి జుట్టు, నెరిసిన గడ్డం , ముఖం మీద గాయాలు ఈ పాత్రను మరింత డెడ్లీ గా ప్రజెంట్ చేస్తున్నాయి.
 
ఈ  పాన్ ఇండియా  ఏజెంట్ లో  సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా కనిపిస్తుండగా,  మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. మొదటి రెండు పాటల్లానే  నిన్న విడుదలైన మూడో పాట రామాకృష్ణ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
 
ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌,  అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.
 
ఏప్రిల్ 28న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర,  దీపా రెడ్డి సహ నిర్మాతలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

Ganga river: గంగానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చున్నీతో కాపాడిన మహిళ (video)

Policemen: డ్యూటీ సమయంలో హాయిగా కునుకుతీసిన పోలీసులు.. అలా పట్టుబడ్డారు..

పాకిస్తాన్ మంత్రి హసన్ లంజార్ ఇంటికి నిప్పు, దరిద్రుడు మా నీళ్లు మళ్లిస్తున్నాడంటూ సింధ్ ప్రజలు ఫైర్

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments