Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్ కేసులో ముగ్గురు హీరోలు.. A, S, R అంటూ నెట్టింట వైరల్

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (17:23 IST)
బాలీవుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ముగ్గురు బడా హీరోల పేర్లు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిని నిజం చేసేలా నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. ఆ ముగ్గురు పేర్లులో మొదటి అక్షరం ఏ, ఎస్, ఆర్‌గా ఉంది. ఈ ప్రకారం చూసుకుంటే ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ఆ ముగ్గురు బడా హీరోలనే చెప్పొచ్చు. అయితే, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరీ (ఎన్సీబీ) అధికారులు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. 
 
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కోణం వెలుగు చూసిన విషయం తెల్సిందే. ఈ కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి కీలక సూత్రధారిగా తేలారు. దీంతో ఆమెతో పాటు.. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్సీబీ అరెస్టు చేసింది. ఈమె వద్ద జరిపిన విచారణంలో అనేక మంది బాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లను వెల్లడించారు. దీంతో వారందరికీ సమన్లు జారీ చేసేపనిలో ఎన్సీబీ ఉంది. ఇప్పటికే నలుగురు హీరోయిన్లకు ఈ సమన్లు జారీ చేయడం, వారివద్ద విచారణ జరపడం కూడా పూర్తయింది. 
 
ఇదిలావుంటే, తాజాగా ఎన్సీబీ విచారణకు హాజరైన హీరోయిన్లలో ఒకరైన దీపికా పదుకొనెతో కలిసి నటించిన ముగ్గురు హీరోలకు ఎన్సీబీ సమన్లు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నిరోజుల నుంచి పలు వెబ్‌సైట్లలో ఇందుకు సంబంధించిన వార్తలు కనపడుతున్నాయి.
 
ఆ హీరోల పేర్లలోని మొదటి అక్షరాలు 'ఏ', 'ఎస్‌', 'ఆర్‌' అని చెబుతున్నాయి. అయితే, ఈ వార్తలను ఓ ఎన్సీబీ అధికారి కొట్టిపారేశారు. కొన్ని మీడియా ఛానెళ్లు అవాస్తవాలను ప్రసారం చేస్తున్నాయని, వాటిపై తమను స్పందించమని కోరుతున్నారంటూ మీడియాపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments