Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవితో శిల్పాశెట్టి.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

అతిలోక సుంద‌రి అంటే అభిమానం లేనిది ఎవ‌రికి. అంద‌రికీ శ్రీదేవి అంటే అభిమాన‌మే. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్.. ఇలా ఎంతోమంది సినీ ప్ర‌ముఖుల అభిమానం సొంతం చేసుకుంది. ఆమె అనంత‌లోకాల‌కు వెళ్లిపోవ‌డంతో... ఆమెతో గ‌డిపిన క్ష‌ణాల‌ను గుర్తుచేసుకుం

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (19:10 IST)
అతిలోక సుంద‌రి అంటే అభిమానం లేనిది ఎవ‌రికి. అంద‌రికీ శ్రీదేవి అంటే అభిమాన‌మే. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్.. ఇలా ఎంతోమంది సినీ ప్ర‌ముఖుల అభిమానం సొంతం చేసుకుంది. ఆమె అనంత‌లోకాల‌కు వెళ్లిపోవ‌డంతో... ఆమెతో గ‌డిపిన క్ష‌ణాల‌ను గుర్తుచేసుకుంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి అతిలోకసుందరి శ్రీదేవితో కలిసి పంచుకున్న క్షణాలను వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

నిర్మాత కరణ్ జోహార్... శ్రీదేవి, శిల్పాశెట్టి, మనీష్ మల్హోత్రాలను తన ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేశారు. అప్పుడు చిత్రీక‌రించిన‌ వీడియోను శిల్పాశెట్టి గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అమ్మ లాంటి శ్రీదేవితో కలిసి ఉన్నామని ఈ వీడియోలో వారంతా చెప్పారు. శ్రీదేవి నటించిన మామ్ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోందని, ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని వారు కోరారు. 
 
ఈ సంతోషకరమైన ఆదివారం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను ఎప్పుడూ నిన్ను ప్రేమతో ఇదేవిధంగా గుర్తు పెట్టుకుంటాను. శ్రీదేవిని ప్రేమించే వారి కోసం ఈ వీడియో అని శిల్పాశెట్టి తన సందేశంలో పేర్కొంది. మీరు కూడా ఈ వీడియో చూడాల‌నుకుంటున్నారా.. అయితే శిల్పాశెట్టి ఇన్‌స్టాగ్రామ్‌ని ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Marri Rajasekhar: వైకాపాకు మరో ఎదురుదెబ్బ- ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా (video)

Vishnupriya: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు యాంకర్ విష్ణుప్రియ

Rain: వేసవి కాలంలో వర్షాలు పడే అవకాశాలు.. మార్చి 22, 23 తేదీల్లో భారీ వర్షాలు

భర్తను 15 ముక్కలు చేసి.. ప్రియుడితో కలిసి విహార యాత్ర

Viral Mass Video: జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకున్న నారా లోకేష్.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments