పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

ఠాగూర్
ఆదివారం, 19 అక్టోబరు 2025 (19:30 IST)
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పండంటి మగబిడ్డకు ఆదివారం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
 
"వాడొచ్చేశాడు.. మా అబ్బాయి.. అతను లేని జీవితాన్ని ఇపుడు ఊహించుకోలేకపోతున్నాం. మా చేతులు నిండాయి. మా హృదయాలు మరింతగా నిండాయి. మొదట మేమిద్దరం ఉన్నాం. ఇపుడు మాకు సర్వస్వం లభించింది" అంటూ భావోద్వేగంతో కూడిన నోట్‌ను రాసుకొచ్చారు. ఈ వార్త తెలియగానే అభిమానులు, పలువురు సినీ, రాజకీయ సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పరిణీతి చోప్రా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. 
 
కాగా, గత 2023లో రాఘవ్ - పరిణీతి చోప్రా వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌‍లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ వేడుకకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్‌తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ గ్లామర్, రాజకీయ వైభవం, కలగలిసిన ఈ పెళ్లి అప్పట్లో దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది., లండన్‌లో చదువుకునే రోజుల్లో మొదలైన వీరి స్నేహం, కొన్నేళ్ల తర్వాత ప్రేమగా మారి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments