అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. పెదనాన్న కుమారుడు వరసకు చెల్లెలయ్యే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనితో ఆమె గర్భం దాల్చి మగబిడ్డకు జన్మనిచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలంలోని ఓ గ్రామంలో బాలిక తన తండ్రితో నివాసం వుంటోంది. తండ్రి పక్షవాతానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో బాలిక తల్లి సంపాదన కోసం దుబాయ్ వెళ్లింది. దీనితో బాలిక ఒంటరిగా వుండటంతో ఆమెపై పెదనాన్న కుమారుడు కన్నేసాడు. ఆమెను లొంగదీసుకుని లైంగిక దాడి చేసాడు. దీనితో ఆమె గర్భం దాల్చింది.
ఈ విషయం తెలుసుకున్న పెదనాన్న కుమారుడు ఊరి వదిలి పారిపోయాడు. బాలిక మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆ బాబును ఎవరికైనా ఇచ్చేయాలనీ, బాధితురాలిని తామే చూసుకుంటామంటూ నిందితుడి తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద పంచాయతీ పెట్టారు. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో అక్కడి నుంచి వాళ్లు పలాయనం చిత్తగించారు. ఐనప్పటికీ మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యం నేపధ్యంలో దీనిపై అధికారులు దృష్టి సారించారు.