హైదరాబాద్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ఓ రాక్షసుడు ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ ఓ కుటుంబం నివసిస్తోంది. వారికి కూతురు (8), కుమారుడు (7) వున్నారు. రోజువారి కూలీపనులు చేసుకుంటూ ఆ కుటుంబం పొట్ట గడుపుకుటుంది. కూలీ పనులతోనే కుటుంబాన్ని దంపతులు పోషించుకుంటున్నారు.
అయితే ఆ దంపతులిద్దరూ కూలీ పనులకు వెళ్లిన సమయంలో యువకుడు ఆ ఇద్దరు చిన్నారులను ఇంటికి పిలిచాడు. అసలేం జరుగుతుందో తెలియని ఏడేళ్ల సోదరుడి ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని చిన్నారులను బెదిరించాడు. ఈ విషయం గురించి తల్లిదండ్రులు పిల్లలను ఆరా తీయగా తల్లిదండ్రులకు జరిగిన వాస్తవాన్ని చెప్పాడు చిన్నారి తమ్ముడు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహాయంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ చిన్నారి తల్లిదండ్రులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన సదరు నిందితుడు అక్కడి నుంచి పారి పోయాడు. కాగా నిందితుడి కోసం సైదాబాద్ పోలీసులు గాలిస్తున్నారు.