శనివారంనాడు హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఆచార్య సినిమా షూటింగ్ సందర్భంగా మన్నెం ప్రాంతంలో కుటీరంలో రామ్‌చరణ్ మేకప్ వేసుకుంటుండగా ఓ వానరం వచ్చి అటూ ఇటూ తిరుగుతూ చరణ్‌ను పరిశీలిస్తుంది. అనంతరం చరణ్ అరటికాయలను ఒలిచి దానికి అతి దగ్గరగా తినిపించడం విశేషం. ఇలా జరగడం తనకెంతో ఆశ్చర్యం కలిగించిందని మెగాస్టార్ తెలియజేశారు.
Hanuman jayanthi
మెగాస్టార్ చిరంజీవి హనుమంతుని భక్తుడు అన్న విషయం తెలిసిందే. తను రోజూ పూజ చేసికానీ బయటకు రాడు. తనకేమైనా సమస్యలుంటే ఆయనముందు చెప్పుకుని మరీ వస్తానని పలుసార్లు వెల్లడించారు. తన తల్లి పేరు కూడా అంజనాదేవి.
కాగా, వానరం వచ్చి ఇలా మనుషుల దగ్గరకు రావడం చాలా ఆరుదైన విషయం. శ్రీశైలం వెళ్లేదారిలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. కానీ ఇలా పక్కకు వచ్చి రామ్‌చరణ్‌తో కోతి గపడడం చాలా ప్రత్యేకంగా చిత్ర యూనిట్ చెప్పుకుంది. ఆ వీడియోను సందర్భానుసారంగా ఈ రోజు విడుదల చేయడం విశేషం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, హనుమంతుని పక్కనే రామ్‌చరణ్ ధ్యానం చేస్తూన్న ఫొటోకూడా పోస్ట్ చేశారు. ఇక ఆచార్య ఈనె 29న విడుదలవుతుంది.