Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేఖ‌ర్ చిత్రాన్ని ఆశీర్వ‌దించండి - త్వ‌ర‌లో పాన్ ఇండియా మూవీ

Webdunia
గురువారం, 19 మే 2022 (20:18 IST)
Dr. Rajasekhar
క‌రోనా వ‌ల్ల ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో చాలా ఇబ్బందులు ప‌డ్డాం .ఒక ద‌శ‌లో చ‌నిపోతాన‌ని అనుకున్నాను. కానీ జీవితా నాకు ధైర్యం నూరిపోసింది. మా కుమార్తెలు మ‌రింత కేర్ తీసుకున్నారు. కొడుకులైనా కుమార్తెలైనా వారే నాకు. వారి వ‌ల్లే నేను బ‌తికాను. ఒక‌దశ‌లో శేఖ‌ర్ సినిమాను ఎవ‌రికైనా ఇచ్చేద్దాం అనుకున్నాను.  సినిమాపై  న‌మ్మ‌కంతో ఖ‌ర్చు బాగా పెట్టాం. నా సినిమాను చూసి న‌న్ను గ‌ట్టెక్కించండి అని రాజ‌శేఖ‌ర్ తెలిపారు. 
 
శేఖ‌ర్ పాత్ర 60లోపు వున్న వ్య‌క్తిక‌థ‌. ఈ సినిమానే డిఫ‌రెంట్ గా వుంటుంది. అందుకే గెట‌ప్‌కోసం కొత్త‌గా వ‌చ్చాను. ఈ గెట‌ప్ వేసిన‌ప్ప‌టినుంచీ షూటింగ్‌లోనూ బ‌య‌ట కూడా మంచి అప్పాజ్ వ‌చ్చింద‌ని.. యాంగ్రీ స్టార్ డా. రాజశేఖ‌ర్ అన్నారు. జీవితా రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శేఖ‌ర్ చిత్రం ఈనెల 20న విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా రాజ‌శేఖ‌ర్ మీడియాతో మాట్లాడారు.

ఒరిజినల్‌ తో పోలిస్తే ‘శేఖర్‌’లో ఏమైనా మార్పులు చేశారా?
పెద్దగా మార్పులు చేయలేదు. మలయాళంలో కొంచెం పేస్‌ స్లోగా ఉంటుంది. తెలుగులో అలా ఉంటే పనికిరాదు. మన తెలుగు ఆడియన్స్‌  తగ్గట్టుగా మార్చుకున్నాం. అలాగే మలయాళం చిత్రంలో కొన్ని సీన్స్‌కి వివరణ ఉండదు..ఇందులో ఆడియన్స్‌కు అర్థం అయ్యేలా వివరణ ఇచ్చాం. నిడివి కూడా ఒరిజినల్‌తో పోలిస్తే.. ఈ చిత్రం నిడివి తక్కువ. 
 
మీ అమ్మాయి(శివాణి) పాత్రను ఏమైనా పెంచారా?
లేదు. మా అమ్మాయి కదా అని పాత్రను పెంచితే.. సినిమాను చెడగొట్టినవాళ్ల అవుతాం. అలా చేయలేదు.
అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిగ్‌ గురించి?
ఈ చిత్రానికి సంగీతం చాలా ముఖ్యం. అనూప్‌ రూబెన్స్‌ చాలా మంచి మ్యూజిగ్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో నా పాత్ర స్మోకింగ్‌ చేయాలి. కానీ నా అనారోగ్యం కారణంగా స్మోకింగ్‌ చేయొద్దని వైద్యులు చెప్పారు. అనూప్‌ తన మ్యూజిగ్‌తో ఈ సీన్స్‌ మ్యానేజ్‌ చేశారు. 
కోవిడ్‌ టైమ్‌లో మీ ఇద్దరు కూతుళ్లు దగ్గర ఉండి మీ బాగోగులు చూశారు.ఎలా అనిపించింది?
నా తమ్ముడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాడే నాతో ‘మీ ఇద్దరు కూతుళ్లే నిన్ను కాపాడారు.గుర్తుపెట్టుకో. నా కొడుకులు కూడా నన్ను అలా చూసుకోలేదు’అన్నాడు. నిజంగా నా కూతుళ్లు, జీవిత ఆ సమయంలో నన్ను బాగా చూసుకున్నారు. కోవిడ్‌ టైమ్‌లో మేం నలుగురం ఐసీయూలోనే ఉండిపోయాం. నేను ఇలా లేస్తే చాలు..డాడీ ఏం కావాలి అంటూ ఇద్దరు వచ్చేవాళ్లు. కొడుకులు తక్కువ అని నేను చెప్పను కానీ.. కూతుళ్లు మాత్రం ఎక్కువే. 
 
మీ నలుగురు కలిసి సినిమా చేసే అవకాశం ఉందా?
ఉంది. కొన్ని కథలు కూడా వచ్చాయి. ‘దొరసాని’ ఫేమ్‌ మహేందర్‌ కూడా మా నలుగురితో ఓ సబ్జెక్ట్‌ అనుకుంటున్నాడు.మేం కొన్ని మార్పులు చెప్పాం. అలాగే ప్రవీణ్‌ సత్తారు కూడా గరుడవేగ పార్ట్‌2లో ఇద్దరు కూతుళ్లను యాడ్‌ చేసే ప్లాన్‌లో ఉన్నాడు. భవిష్యత్తులో తప్పుకుండా మేమంతా కలిసి సినిమా చేస్తాం. 
 
ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సుకుమార్‌ గారు మాట్లాడుతూ..మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనే సినిమాల్లోకి వచ్చామని చెప్పారు.ఎలా అనిపించింది?
చాలా హ్యాపీగా ఫీలయ్యా. నాకు ఇన్ని రోజులు ఈ విషయం తెలియదే అని ఫీలయ్యా(నవ్వుతూ..)
 
కొత్త సినిమాలు ఏం ఉన్నాయి?
త్వరలోనే ఓ పెద్ద అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది.  మా కుటుంబం అంతా క‌లిసి న‌టించే క‌థ ఒక‌టి త‌యారుకాబోతుంది. పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

బొత్తిగా రోడ్ సెన్స్ లేదు, కళ్ల ముందు కనిపిస్తున్నా ఎలా ఢీకొట్టేసాడో చూడండి (video)

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

మోహన్ బాబును అరెస్టు చేస్తాం : రాచకొండ సీపీ వెల్లడి (Video)

జనసేనలోకి మంచు మనోజ్.. మౌనికా రెడ్డి!! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments