Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేఖర్ రెడ్డి ఇంట్లో దొరికిన డబ్బంతా దివ్యాంగులకు టాయిలెట్లు నిర్మించండి: విశాల్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న శేఖర్ రెడ్డి నల్లధనం వ్యవహారం సామాన్య ప్రజల నుంచి వీఐపీల వరకు అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. కట్టలు కట్టలు కొత్త నోట్లు అట్టపెట్టెల్లో తవ్వేకొద్దీ బయటపడుతుండడ

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2016 (14:43 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న శేఖర్ రెడ్డి నల్లధనం వ్యవహారం సామాన్య ప్రజల నుంచి వీఐపీల వరకు అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. కట్టలు కట్టలు కొత్త నోట్లు అట్టపెట్టెల్లో తవ్వేకొద్దీ బయటపడుతుండడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ డబ్బంతా ఏం చేస్తారు? అన్న ప్రశ్న ఉదయిస్తోంది.

ఇందుకు నటుడు విశాల్‌ ఒక సూచన చేశారు. 'శేఖర్‌రెడ్డి ఇంట్లో దొరికిన డబ్బుంతా దివ్యాంగులకు టాయిలెట్లు నిర్మించేందుకు, కేన్సర్‌, లెప్రసీ రోగుల చికిత్సలకు విరాళంగా ఇవ్వాలని ఆశిస్తున్నాను' అని శనివారం ట్విట్టర్‌లో ఒక సందేశాన్ని ఉంచారు.
 
ఇదిలా ఉంటే.. పెద్దనోట్ల రద్దు తర్వాత తమిళనాడులోనే అత్యంత ఎక్కువ మొత్తం ధనం, బంగారం బయటపడిన సంఘటన జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి సభ్యుడు శేఖర్ రెడ్డి నుంచి 90 కోట్ల రూపాయల నగదు, వంద కిలోల బంగారం ఐటీ అధికారులకు చిక్కాయి. కాగా శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు వరుసగా నాలుగో రోజైన ఆదివారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ శాఖ చేపట్టిన సోదాల్లో కళ్లు చెదిరేలా ఆస్తులు బయటపడుతున్నాయి.
 
ఇప్పటి వరకు 170 కిలోల బంగారం, రూ.131కోట్ల నగదు, రూ.వెయ్యి కోట్లకు పైగా ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వేలూరులో శేఖర్ రెడ్డి, ఆయన సంబంధీకుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మెట్టు దిగిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

హిందూ - ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్ర : రాహుల్ గాంధీ

ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?

'ఆర్ఆర్ఆర్‌'పై థర్డ్ డిగ్రీ ప్రయోగం... కటకటాల వెనక్కి సీఐడీ మాజీ ఏఎస్పీ

ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments