Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌తో అరియానా రొమాన్స్.. సోహెల్ దోతీ లాగిన హారిక.. అభిజీత్‌కు ఏమైంది?

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (18:51 IST)
Bigg Boss 4
బిగ్ బాస్ రియాల్టీ షోలో ప్రేమ, గ్లామర్ డోస్ పెరుగుతోంది. కొత్త టాస్క్‌లు, హౌస్‌మేట్స్ దూకుడుకు కారణమవుతున్నా. ప్రేమలు, కోపాలతో.. ప్రేక్షకులకు బోలెడంత వినోదం అందుతోంది. గురువారం ఇంటి సభ్యులను ఏడిపించాడు బిగ్ బాస్. సెంటిమెంట్ రగిలించి భావోద్వేగాలకు లోనయ్యేలా చేశాడు.

చిన్ననాటి ఫొటోలు, తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోలను చూపించి.. ఇంటి సభ్యులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆ ఫొటోలను చూసిన హౌస్‌మేట్స్.. కుటుంబ సభ్యులను గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. వారితో తమకున్న బంధాన్ని అందరితో పంచుకున్నారు.
 
ఇవాళ ఇంట్లో గర్ల్స్ పార్టీ చేసుకున్నారు. లాస్య, దివి, హారిక, మోనాల్, అరియానా అందంగా ముస్తాబయ్యారు. యువకులను ఆటపట్టిస్తూ సందడి చేస్తారు. ఈ క్రమంలో అఖిల్‌తో రొమాన్స్ చేసింది అరియానా. అతడిని పట్టుకొని.. సాయంత్రం మల్లెపూలు తేనా.. అని అనడంతో అందరూ నవ్వారు. ఇక సోహెల్ చిలిపిగా దివి చేతిపై కొడతాడు. అలా కొడతావా? అని అరియానా అడుగుతుంది. ఇది సోహల్ గాడి జాగిరి.. నకో కరో కిరికిరి అని మెహబూబ్ అనడంతో.. నీ పొగరు నడవదురో.. దయచేసి వినాలిరో అని అరియానా సెటైర్లు వేస్తుంది.
 
అంతేకాదు హారిక.. సోహెల్ దోతీ పట్టుకొని లాగడంతో.. మరోసారి హౌస్‌మేట్స్ పగలబడి నవ్వుతారు. ఇవాళ్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. దానిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ఐతే రెండు రోజులుగా అభిజీత్‌ను పెద్దగా చూపించడం లేదని.. అతడికి కొంపదీసి కరోనా వచ్చిందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం.. శునకాన్ని ఆటోపై ఎక్కించుకుని తిరిగాడు.. (Video)

Andhra Pradesh: ఏపీలో భూప్రకంపనలు.. రెండు సెకన్ల పాటు కంపించింది.. పరుగులు

యూపీలో ఇద్దరు యువతుల వివాహం.. ప్రేమ.. పెళ్లి ఎలా?

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments