Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Krack కోసం అప్సరా రాణి ఐటెంసాంగ్.. మాస్ మహారాజాతో సెల్ఫీ వైరల్

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (18:09 IST)
Krack
మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సాధారణంగా రవితేజ సినిమా అంటే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాల్సిందే. కామెడీ, యాక్షన్, డ్యాన్స్ ఇలా ఏ విషయంలోనైనా రవితేజ స్టైలే వేరు. ఈ హీరో ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఇందులో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో అందరికీ వినోదాన్ని అందించేందుకు ఐటంసాంగ్‌ను పెట్టాడు డైరెక్టర్. రాంగోపాల్ వర్మ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకులను ఆడియెన్స్‌ను అలరించిన అప్సరా రాణి ఐటెంసాంగ్‌లో కనిపించనుంది.
 
తాజాగా ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన స్టిల్‌ను గోపీచంద్ మలినేని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. మాస్ రాజా రవితేజ, జానీ మాస్టర్, అప్సరా రాణి కాంబోలో ప్రేక్షకుల్లో జోష్ నింపేందుకు మాస్ సాంగ్ రాబోతుందని చెప్పాడు గోపిచంద్. సెట్స్‌లో అప్సరా రాణి స్టన్నింగ్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తుండగా.. రవితేజ, జానీ, గోపీచంద్ బ్లాక్ డ్రెస్సుల్లో కలిసి దిగిన సెల్పీ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
 
రవితేజ, శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ తరవాత తిరిగి ప్రారంభమైంది. ఈ షూటింగ్ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక సినిమా కూడా ఓటీటీలో విడుద‌ల కానుంద‌ని ప‌లు వార్త‌లు ప్ర‌చార‌మ‌వుతున్నాయి. అన్యాయాన్ని ఎదురించే నిజాయితీప‌రుడైన పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో’ ర‌వితేజ క‌నిపించ‌బోతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments