Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభం... కంటెస్టెంట్స్‌లో కరాటే కళ్యాణి - గంగవ్వ - లాస్య - దేవి

Webdunia
ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (22:57 IST)
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్ బాస్ 4వ సీజన్ ఆదివారం నుంచి ప్రారంభమైంది. హోస్ట్‌గా టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జు తన సమ్మోహనకరమైన మాటలతో బిగ్ బాస్ రియాలిటీ షో వీక్షకులకు స్వాగతం పలికారు. ఈసారి వేదికపై నాగ్ డ్యూయల్ రోల్ చేశారు. వృద్ధుడైన తండ్రిగా, కుమారుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ వినోదం అందించే ప్రయత్నం చేశారు. 
 
వృద్ధ నాగార్జున బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించి ఒక్కో ప్రదేశాన్ని ఆడియన్స్‌కు పరిచేయం చేశారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో ఎప్పుడూ లేనంత రిచ్‌గా కనిపిస్తోంది. గార్డెన్ నుంచి కిచెన్ వరకు ప్రతిదీ నవ్యత సంతరించుకుంది. డైనింగ్ టేబుల్, హాల్, బెడ్ రూములు, స్విమ్మింగ్ పూల్... ఇలా ప్రతి అంశం ఎంతో రంగులమయంగా ఉంది. ఇదిలావుండగా, ఈ సీజన్ కోసం బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన వారి వివరాలను పరిశీలిస్తే, 
 
మోనాల్ గజ్జర్ (హీరోయిన్), సూర్యకిరణ్ (దర్శకుడు), లాస్య (యాంకర్), అభిజిత్ (నటుడు), జోర్దార్ సుజాత (యాంకర్), మహబూబ్ దిల్ సే (యూట్యూబర్), దేవి నాగవల్లి (టీవీ9 న్యూస్ ప్రజెంటర్), దేత్తడి హారిక (యూట్యూబర్), సయ్యద్ సొహైల్ రియాన్ (నటుడు) (సీక్రెట్ హౌస్‌లోకి ఎంట్రీ), అరియానా గ్లోరీ (యాంకర్), (సీక్రెట్ హౌస్ లోకి ఎంట్రీ), అమ్మ రాజశేఖర్ (కొరియోగ్రాఫర్), కరాటే కల్యాణి (నటి), నోయల్ షాన్ (సింగర్/నటుడు), దివి (మోడల్/నటి), అఖిల్ సార్థక్ (నటుడు), గంగవ్వ (యూట్యూబర్)లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments